Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Riyan Parag: ఇదేం పాడు బుద్ధి.. హీరోయిన్ల అందాలు చూసి సొల్లు కారుస్తూ!(Video)

ఐపీఎల్ స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ సీజన్‌లో పరుగుల వరద పారించి ప్రశంసలు అందుకున్న పరాగ్, ఇప్పుడు తన ప్రవర్తనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇదేం పాడు బుద్ధి అంటూ నెటిజన్లందరూ ఈ యువ స్టార్‌పై మండిపడుతున్నారు. హుందాగా ఉంటూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిందిపోయి, అమ్మాయిల పట్ల వక్రబుద్ధి ఏంటని ప్రశ్నిస్తున్నారు

అసలేం జరిగిదంటే.. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరడంలో పరాగ్‌ది కీలక పాత్ర. ఆరెంజ్ క్యాప్ కోసం ఓ దశలో విరాట్ కోహ్లితో పోటాపోటీగా పరుగులు చేశాడు. అతిత్వరలో టీమిండియా తలుపు తట్టేలా బ్యాటింగ్ చేశాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 52 సగటు, 149 స్ట్రైక్‌రేటుతో 573 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లి (741), రుతురాజ్ గైక్వాడ్ (583) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.

Riyan Parag Faces Backlash Over Leaked YouTube History Featuring Ananya Pandey Hot and Sara Ali Khan Hot

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయిర్-2లో పరాగ్ రాజస్థాన్‌ను గెలిపించలేకపోయాడు. కీలక మ్యాచ్‌లో 10 బంతుల్లో ఆరు పరుగులకే వెనుదిరిగాడు. టోర్నీ నుంచి రాజస్థాన్ నిష్క్రమించడంతో రియాన్ పరాగ్ తన రొటీన్ లైఫ్‌ను మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్‌లో పరాగ్ పాల్గొన్నాడు. ఈ సెషన్ రియాన్ పరాగ్‌ను చిక్కుల్లోకి నెట్టింది.

స్ట్రీమింగ్ సందర్భంగా అతను యూట్యూబ్ ఓపెన్ చేశాడు. అందులో తన సెర్చ్ హిస్టరీ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. స్టార్ హీరోయన్ల హాట్ వీడియోలు వెతికిన తన యూట్యూబ్ హిస్టరీ ప్రత్యక్షమైంది. అన్యన పాండే హాట్, సారా అలీ ఖాన్ హాట్ అంటూ సెర్చ్ హిస్టరీలో ఉంది. ఈ హీరోయిన్ల అందాల కోసం వెతికిన రియాన్ పరాగ్ విరాట్ కోహ్లి పేరిట కూడా యూట్యూబ్ శోధన చేసినట్లుగా కనిపించింది. తన సెర్చ్ హిస్టరీని పరాగ్ హైడ్ చేయకపోవడంతో రియాన్ పర్సనల్ హిస్టరీ పబ్లిక్‌కు లీక్ అయ్యింది. దీంతో పరాగ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Story first published: Monday, May 27, 2024, 22:34 [IST]
Other articles published on May 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+