వికెట్ తీసిన ఆనందం.. మైదానంలో గొంగళి పురుగు సెలబ్రేషన్స్ (వీడియో)

ప్రిటోరియా (దక్షిణాఫ్రికా): క్రికెట్ ఆటలో సిక్సర్లు, ఫోర్లు, వికెట్లు, కళ్లు చెదిరే క్యాచ్‌లతో పాటు ఆటగాళ్లు చేసే వినూత్న సెలబ్రేషన్స్ కూడా అభిమానులను ఎంతో ఆకట్టుకుంటాయి. వికెట్ తీసిన అనడంలో షెల్డన్ కాట్రెల్ సెల్యూట్ చేయడం, ఇమ్రాన్ తాహిర్ మైదానంలో పరుగెత్తడం, డ్వేన్ బ్రేవో డాన్స్ చేయడం.. క్యాచ్ పట్టగానే శిఖర్ ధావన్ తొడగొట్టడం, క్రిస్ గేల్ స్టెప్పులు వేయడం లాంటివి మనం చూసే ఉంటాం. తాజాగా దక్షిణాఫ్రికా బౌలర్ రివాల్డో మూన్సామీ సరికొత్త సెలబ్రేషన్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఎల్బీడబ్ల్యూ ఔట్
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ప్రొవెన్షియల్ కప్ పూల్-బిలో భాగంగా నార్తెరెన్, బోర్డర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నార్తెరెన్ జట్టుకి చెందిన పార్ట్‌టైమ్ బౌలర్ రివాల్డో మూన్సామీ వేసిన ఇన్నింగ్స్ 69వ ఓవర్ చివరి బంతిని బోర్డర్ టీమ్ ఆల్‌రౌండర్ నోనెలీలా యిక్కీ ఎదుర్కొన్నాడు. రివాల్డో వేసిన బంతి యిక్కీ పాడ్లను తాకగా.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం బౌలర్ అప్పీల్ చేసాడు. వెంటనే లేడీ ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చారు.

వింత సంబరాలు
వికెట్ లభించిన ఆనందంలో రివాల్డో వింతగా సంబరాలు చేసుకున్నాడు. పిచ్‌పై పడుకుని గొంగళి పురుగు మాదిరిగా ముందుకు వెళ్ళాడు. కాసేపు అలానే పాకాడు. ఈ సమయంలో అతడ్ని అభినందించేందుకు సహచరులు వచ్చినా.. అతగాడు పట్టించుకోలేదు. ఇక ఫీల్డ్ అంపైర్ అతనికి క్యాప్‌ని అందిస్తున్నా వెనక్కి తిరగలేదు. దీంతో క్యాప్ వేరే ఆటగాడికి ఇచ్చి వెళ్లిపోయారు.
మరో నూతన సెలబ్రేషన్
రివాల్డో మూన్సామీ గొంగళి పురుగు సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోకి పోస్ట్ చేసిన కొద్దిగంటల్లోనే వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. క్రికెట్ ఫాన్స్ తమదైన స్టయిల్లో కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మరో నూతన సెలబ్రేషన్' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'రివాల్డో నువ్ కేక' అని మరో అభిమాని కెమెంట్ చేసాడు. మరికొందరు మాత్రం రివాల్డో సెలబ్రేషన్స్‌ను విమర్శిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications