కెప్టెన్సీ మార్పుతోనే పూణె అదృష్టం మారింది: ముంబైకు చుక్కలు
హైదరాబాద్: కెప్టెన్సీ మార్పుతో పాటు ప్రాంఛైజీ పేరు మార్చడంతో పూణె జట్టు అదృష్టం మారినట్లుంది. ఒంటి చేత్తో మ్యాచ్‌ని గెలిపించగలిగే సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ జట్టు ఎందుకో గత సీజన్‌లో తడబడింది. అయితే ఐపీఎల్ 10వ సీజన్‌లో మాత్రం ఆరంభ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది.
ఉత్కంఠ పోరులో ముంబైపై విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్‌కు పెట్టింది పేరుగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపెడుతూ భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి కెప్టెన్ స్టీవ్ స్మిత్ మెరుపులతో లీగ్‌లో ఘనంగా బోణీ చేసింది. గురువారం పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది.
185 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రహానే (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) మెరుపులు మెరిపించడంతో ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.
ముంబై బ్యాట్స్‌మెన్లలో జోస్ బట్లర్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 35.. నాటౌట్), నితీష్ (34) రాణించడంతో ముంబై 184 పరుగులు చేయగలిగింది. పుణె బౌలర్లలో తాహిర్ 3, రజిత భాటియా 2 వికెట్లు తీశారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు' లభించింది.

20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసిన ముంబై
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్‌లోనే 11 పరుగులు రాబట్టింది. అయితే దిండా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో పార్థివ్ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను రజత్ భాటియా జారవిడిచాడు. బెన్ స్టోక్స్ తను వేసిన తొలి ఓవర్‌లోనే బట్లర్ రెండు సిక్సర్లు బాది జోరు చూపాడు.

తొలి వికెట్‌కు 25 బంతుల్లో 45 పరుగుల
ఇమ్రాన్ తాహిర్ వేసిన తొలి ఓవర్‌లోనే పార్థివ్‌ను బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు 25 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆరో ఓవర్‌లో బట్లర్ మరోసారి విరుచుకుపడి వరుస బంతుల్లో 4,6 తో రెచ్చిపోయాడు. అయితే తాహిర్ తన రెండో ఓవర్ మూడు బంతుల్లో కెప్టెన్ రోహిత్ (3), ధాటిగా ఆడుతున్న బట్లర్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు)ను అవుట్ చేయడంతో ముంబై షాక్‌కు గురైంది.

ముంబైని ఆదుకునే ప్రయత్నం చేసిన రానా, పొలార్డ్
ఆ తర్వాత రానా, పొలార్డ్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ముంబైని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓపెనర్ జోస్ బట్లర్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నితిష్ రానా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) పరుగులతో రాణించారు. చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా వరుసగా 6,6,6,4,6 సాధించడంతో జట్టు స్కోరు 154 పరుగుల నుంచి 184 పరుగులకు చేరింది.

రహానే విశ్వరూపం
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పూణె 19.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. రహానే మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. హార్ధిక్ వేసిన ఆ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదగా మూడో ఓవర్‌లో వరుసగా 6,4తో చెలరేగాడు. కానీ మూడో ఓవర్‌లో మయాంక్ (6) వికెట్‌ను మెక్లీనగన్ తీశాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ దశలో రహానేకు సహకారం అందించాడు.

పవర్‌ప్లేలో 59 పరుగులు సాధించిన పూణె
మెక్లీనగన్ మరుసటి ఓవర్‌లో స్మిత్ ఫోర్‌తో పాటు రహానే వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో పవర్‌ప్లేలో పుణే 59 పరుగులు చేసింది. 9వ ఓవర్‌లో రహానే బౌండరీతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే సౌతీ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో రహానే సూపర్ ఇన్నింగ్స్ నితిష్ రానా అద్భుత డైవ్ క్యాచ్‌తో ముగిసింది.

స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
అయినా సరే స్మిత్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. 13వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన స్మిత్ చివరి బంతికి ఇచ్చిన క్యాచ్‌ను రాణా మిస్ చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 37 బంతుల్లో తను అర్ధ సెంచరీ చేశాడు. 19వ ఓవర్‌లో ధోని (12 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్) ఇచ్చిన క్యాచ్‌ను సౌథీ అందుకోలేకపోయాడు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీసుకుని 21 (14 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు మాత్రమే చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications