ఏడు పరుగులతో సెంచరీ మిస్: విచారం లేదన్న త్రిపాఠి
హైదరాబాద్: ఏడు పరుగుల తేడాతో ఐపీఎల్‌లో తొలి సెంచరీని మిస్ చేసుకున్నప్పటికీ ఎటువంటి విచారం లేదని రైజింగ్ పూణె సూపర్ జెయింట్ యువ క్రికెటర్ రాహుల్ త్రిపాఠి అన్నాడు. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి పూణెని ఒంటి చేత్తో గెలిపించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం రాహుల్ త్రిపాఠి మాట్లాడాడు. సెంచరీ చేయడం కంటే జట్టును గెలిపించడమే ముఖ్యమని అన్నాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించడం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో త్రిపాఠి 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు.

చివరి వరకు క్రీజులో ఉండాలనుకున్నా
‘ఈ రోజు బాగా ఆడాను. చివరి వరకు క్రీజులో ఉండాలనుకున్నాడు. సెంచరీ కోల్పోయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు. మ్యాచ్ గెలవడం అన్నిటికంటే ముఖ్యం. ఎటువంటి ప్రణాళికలు వేసుకోకుండానే బ్యాటింగ్‌కు దిగాను. ధోని, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ఆటగాళ్లతో ఆడడం నాకెంతో ఉపకరించింది. రహానేతో ఓపెనింగ్‌కు రావడం అద్బుతమైన అనుభవం. రహానే నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు' అని త్రిపాఠి అన్నాడు.

అరుదైన ఘనత
ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో రాహుల్ త్రిపాఠి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో అత్యంత వేగంగా అర్ధ శతకం చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు తన సహచర ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, రహానేలను సైతం వెనక్కు నెట్టేశాడు.

ధోని, రహానే రికార్డును అధిగమించాడు
ఐపీఎల్ పదో సీజన్‌లో రహానే 27 బంతుల్లో, ధోనీ 29 బంతుల్లో అర్ధ సెంచరీలు చేసి రికార్డు నమోదు చేశారు. అయితే బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో తన మెరుపు ఇన్నింగ్స్‌తో 23 బంతుల్లోనే 53 పరుగులు (8 ఫోర్లు, 3 సిక్సులు)తో అర్ధ సెంచరీ చేసి వారి రికార్డుని తిరగరాశాడు.

త్రిపాఠిపై ప్రశంసల వర్షం
రాహుల్ త్రిపాఠి ప్రదర్శనతో ఉబ్బితబ్బిబైన పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతడిని ప్రశంసల్లో ముంచెత్తాడు. 'రాహుల్ త్రిపాఠి అంటే ఏమిటో మాకు ఈ మ్యాచ్ తెలిసేలా చేసింది. మ్యాచ్‌లో రానురాను వికెట్ స్లోడౌన్ అవుతుందని మేం భావించాం. అందుకే ఆరంభ పవర్ ప్లేలోనే ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రయత్నించాం' అని స్మిత్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications