ధోనికి వ్యతిరేకంగా ట్వీట్స్: గొయెంకాపై మండిపడ్డ ఫ్యాన్స్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో యాజమాన్యం విభేదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. తాజాగా పూణె సూపర్ జెయింట్ జట్టు యజమాని సంజయ్ గోయెంకా సోదరుడు హర్ష్ గొయెంకా చేసిన ట్వీట్లు ధోనీ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.

ప్రభావం చూపని ధోని
పూణె ఆడిన తొలి మ్యాచ్‌లో ధోని ప్రభావం చూపలేకపోగా.. అతడి స్థానంలో కెప్టెన్ అయిన స్టీవ్ స్మిత్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్ష్ గొయెంకా ‘‘అడవిలో రాజెవరో స్మిత్ రుజువు చేశాడు. అతడు ధోని మరుగున పడేలా చేశాడు. ఇది కెప్టెన్ ఇన్నింగ్స్. కెప్టెన్‌గా స్మిత్‌ను నియమించడం గొప్ప నిర్ణయం'' అని ట్వీట్ చేశాడు.

మండిపడుతున్న ధోని అభిమానులు
ఈ ట్వీట్‌తో ధోని అభిమానులు మండిపడుతున్నారు. ధోని అభిమానులు ఆగ్రహంతో 'ఇంకా సీజన్ ఆరంభంలోనే ఉంది, అయినా ఒకటి లేదా రెండు ఇన్నింగ్స్ ఆధారంగా ధోనీ లాంటి ఆటగాడిపై అనుచిత వ్యాఖ్యలు అవసరమా?' అంటూ సున్నితంగా విమర్శించారు.
అగౌరవపరిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
ధోని వల్లే పుణె జట్టుకు అభిమానులు లభించారని.. అలాంటి దిగ్గజ ఆటగాడిని అగౌరవపరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దీనికి ఏమాత్రం వెనుకడగు వేయని హర్ష్ ఈ సీజన్ గణాంకాలను చూపిస్తూ, ధోనీ స్ట్రయిక్ రేట్ తక్కువగా ఉందని ఎత్తి చూపుతూ మరో ట్వీట్ చేశాడు.
ఐపీఎల్‌లో ధోనీ గణాంకాలు ఇలా
దీంతో మరింత మండిపడ్డ ధోనీ అభిమానులు ఐపీఎల్లో ధోనీ గణాంకాలను చూపిస్తూ... రెండు ఇన్నింగ్స్ లలో ఆడింది మాత్రమే ధోనీ ప్రదర్శన కాదని... ఇదంతా ధోనీ ప్రదర్శన అని ఘాటుగా విమర్శలు చేశారు. దీంతో ధోని వర్సెస్ పూణె యాజమాన్యంగా ఉన్న వివాదం పూణే యాజమాన్యం వర్సెస్ ధోనీ అభిమానులుగా మారడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications