హైదరాబాద్: ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లను కూడా భారత క్రికెట్ అభిమానులు ఆదరిస్తున్న తీరుకు విదేశీ క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఈ మ్యాచ్‌కు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ భావోద్వేగ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాదాపు నాలుగు నెలల భారత్ పర్యటనలో ఉన్న తనకు ఇక్కడ ప్రజలు చూపించిన ప్రేమాభిమానులు మరువలేనివని తెలిపాడు.

'భారత్‌లో సుదీర్ఘ జర్నీ నిజంగా అద్భుతంగా ఉంది. నాలుగు నెలలు ఉండటం సంతోషంగా ఉంది. ఈ మధ్యలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ వాటినుంచి ఎంతో నేర్చుకున్నాను. టెస్టు మ్యాచ్‌లను ఆస్వాదించా. కొంత మంది గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను. మరికొంత మంది కొత్త స్నేహితులను సంపాదించుకున్నా' అని స్మిత్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఐపీఎల్‌లో పూణెకు ఆడుతుండటం అద్భుతమైన అనుభవంగా భావిస్తున్నా. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ముందు భారత్‌లో నాకు ఇదే చివరి రాత్రి. భారత్‌లో ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. మా జట్టుకు మద్దతు తెలిపిన అభిమానులకు సైతం కృతజ్ఞతులు. ఈ పర్యటన ఎప్పటికీ నాకు గొప్ప జ్ఞాపకంగా గుర్తుండి పోతుంది' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాన్ని పోస్ట్ చేశాడు.
దీంతో పాటు ఈ నాలుగు నెలల పర్యటనలో మధురానుభూతి ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. అందులో ధోనీని ఆలింగనం చేసుకోబోతున్న ఫొటో కూడా ఉండటం విశేషం. ఐపీఎల్ పదో సీజన్‌లో పైనల్స్‌లో పూణె.. ముంబైతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా కొత్త చరిత్రను సృష్టిస్తారు.