కోహ్లీసేనకు సలహా: రిషి కపూర్ ట్వీట్ ఎంతపని చేసింది!

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడే భారత జట్టుని సెలక్టర్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. బీసీసీఐ భారత జట్టుని ప్రకటించిన అనంతరం బాలీవుడ్ వెటరన్ రిషి కపూర్ తన ట్విట్టర్‌లో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
వరల్డ్‌కప్‌కు ఎంపికైన 15మంది ఆటగాళ్ల ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రిషి కపూర్ "ఈ ఫోటోని రిఫరెన్స్ పాయింట్‌గా తీసుకోవద్దు.. అయితే జట్టులో ఎక్కువమంది గడ్డంతో ఉన్నారు. అందరూ సామ్సన్‌లా?(ప్రాచీన ఇజ్రాలియన్ న్యాయాధిపతుల్లో సామ్సన్ ఒకరు. ఆయన బలమంతా అతని వెంట్రుకల్లోనే ఉండేదని ప్రతీతి). గడ్డం లేకుంటే అందంగా, చురుగ్గా ఉంటారు. ఇది కేవలం నేను గమనించింది" అంటూ కామెంట్ పెట్టారు.
రిషి కపూర్ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 2011 వరల్డ్‌కప్ జట్టు సభ్యుల్లో చాలా మంది గడ్డం లేకుండా ఉన్నారంటూ అప్పటి ఫోటోని ఓ నెజిటన్ పోస్ట్ చేయగా... ఇంగ్లాండ్‌లో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి, గడ్డం పెంచుకుని ఉంటారు అని మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications