
రిషి ధావన్‌కు జరిమానా
హిమాచల్‌ప్రదేశ్‌కి చెందిన రిషి ధావన్ తాజాగా తన సొంత కారులో బ్యాంక్ పని మీద రోడ్డుపైకి వచ్చాడు. ఇది చూసిన అక్కడి పోలీసులు ధావన్ కారుని ఆపారు. లాక్‌డౌన్ రూల్స్‌ని అతిక్రమించినందుకు రూ. 500 జరిమానా విధించారు. అక్కడే జరిమానా కట్టేసి.. రిషి ధావన్ కారులో ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం తెలిసింది. అయితే రిషి ధావన్ రిలాక్సేషన్ పీరియడ్ (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట) సమయంలోనే బయటకు వచ్చాడు. కానీ అతని కారుకి ఎలాంటి వెహికల్ పాస్ లేకపోవడంతో పోలీసులు జరిమానా విధించారు.

మూడు వన్డేలు, ఒక టీ20
రిషి ధావన్ టీమిండియా తరఫున 2016లో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జట్టుకు ఎంపికవ్వలేదు. ఇక దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. హిమాచల్‌ప్రదేశ్ తరఫున తరచుగా క్రికెటర్ ఆడుతున్న రిషి.. ఇప్పటి వరకూ 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 3,702 పరుగులు, 308 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో 125 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రిషి ధావన్ ఆడాడు. అయితే 2017 తర్వాత ఐపీఎల్‌కీ దూరమయ్యాడు. గతేడాది జరిగిన వేలంలో అతనికే నిరాశే ఎదురైంది.

కరోనాపై జాగ్రత్తలు చెపుతున్న ప్లేయర్లు
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం అతలాకుతలమవుతున్నది. అన్ని దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి ప్రభావానికి రోజు వేలల్లో జనాలు మరణిస్తున్నారు. చైనాలో మొదలయి ప్రపంచ మానవాళికి ముప్పుగా పరిణమించిన కొవిడ్-19 కారణంగా కోట్లాది మంది అల్లాడిపోతున్నారు. అంతకంతకు ప్రమాదకరంగా మారుతున్న కరోనాతో ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీలు రద్దు కావడంతో ఆటగాళ్లు అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. చాల మంది ప్లేయర్లు కరోనా కట్టడి కోసం తమ వంతు సాయం ప్రకటించారు. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రజలందరూ కరోనాపై జాగ్రత్తలు తీసుకుని, క్షేమంగా ఉండాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications












