బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (41; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. జోస్ హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసేసరికి 27 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. టీమిండియా 83 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో అలెక్స్ కేరి (19 బ్యాటింగ్; 28 బంతుల్లో, 3 ఫోర్లు), మిచెల్ స్టార్క్ (6 బ్యాటింగ్; 14 బంతుల్లో, 1 ఫోర్) ఉన్నారు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా (4/17) నాలుగు వికెట్లు, మహ్మద్ సిరాజ్ (2/17) రెండు వికెట్లు, హర్షిత్ రాణా (1/33) ఒక్క వికెట్ తీశారు.

అయితే శుక్రవారం ఆటలో రిషభ్ పంత్-నాథన్ లైయన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పంత్ ఏకాగ్రతను దెబ్బతీయడాని స్పిన్నర్ లైయన్ ప్రయత్నించాడు. పంత్ బ్యాటింగ్ చేస్తుండగా దగ్గరకు వచ్చి.. 'పంత్.. ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీకి వెళ్తున్నావు' అని ప్రశ్నించాడు. దానికి పంత్ కూల్‌గా రియాక్ట్ అయ్యాడు. 'నో ఐడియా' అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. తాను డబ్బు కోసమే ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడలేదని పంత్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
తనపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై పంత్ స్పందిస్తూ అలా అన్నాడు. పంత్ మొదటి ప్రాధాన్యత రుసుము కంటే ఎక్కువ ఆశించి ఉండొచ్చని, దీంతో ప్లేయర్-ఫ్రాంచైజీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పంత్‌ను ఐపీఎల్ గురించి మ్యాచ్ మధ్యలో లైయన్ ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. కాగా, జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు వేలం ప్రారంభం కానుంది. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 577 మందినే షార్ట్ లిస్ట్ చేసింది.
SOUND 🔛 Just two old friends meeting! 😁🤝
— Star Sports (@StarSportsIndia) November 22, 2024
Don't miss this stump-mic gold ft. 𝗥𝗜𝗦𝗛𝗔𝗕𝗛-𝗣𝗔𝗡𝗧𝗜! 🤭
📺 #AUSvINDOnStar 👉 1st Test, Day 1, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/vvmTdJzFFq