క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ వచ్చేసింది. అయితే ఈ టోర్నీ ప్రారంభం నుంచి బెంచ్ కే పరిమితమైన స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ పంత్ కు.. తుది పోరులోనైనా అవకాశం కల్పిస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కేఎల్ రాహులే మళ్లీ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఎందుకంటే అతడు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మంచి ప్రదర్శనే చేశాడు. దీంతో రాహుల్ ను ఏమాత్రం తప్పించే అవకాశం కనిపించట్లేదు.
కానీ పంత్ అభిమానులు, పలువురు మాజీలు.. అతడు తుది జట్టులో ఉంటే బాగుండు అని ఆశిస్తున్నారు. ఒకవేళ అతడు ఈ ఫైనల్ తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే మిడిలార్డర్ లో ఎవరైనా ఓ బ్యాటర్ గాయపడటం లేదా ఇతర కారణాలతో తప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పంత్.. సదరు ఆటగాడి స్థానంలోకి వెళ్లొచ్చు.

అయితే విరాట్ కోహ్లీ గాయపడినట్లు మొదట వార్తలొచ్చాయి కానీ.. ఆ తర్వాత అతడే ఆడతాడని కన్ఫామ్ అయిపోయింది. కాబట్టి ఇక పంత్ కు దాదాపుగా ఫైనల్ మ్యాచ్ లో ఆడే అవకాశం ఉండదని పలువురు భావిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ లో అతడు తన సహ క్రికెటర్లు వాటర్, ఎనర్జీ డ్రింక్ లు మోసుకెళ్లి ఇవ్వడమే అని కామెంట్లు చేస్తున్నారు.
It's a Super Sunday ☀️
— BCCI (@BCCI) March 2, 2025
..And with it comes an opportunity to continue the winning habit 👌👌
Here's KL Rahul with what's in store for #NZvIND 😎
WATCH 🎥🔽 #TeamIndia | #ChampionsTrophy | @klrahul
టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ పంత్ జట్టులో లేకపోవడంపై మాట్లాడుతూ.. కాస్త జాలి ప్రదర్శించాడు. పంత్ దురుదృష్టవంతుడని పేర్కొన్నాడు. "భారత జట్టు మంచి ఫామ్ లో ఉంది. కేఎల్ రాహుల్ మరీ అంత చెత్త ప్రదర్శన చేయట్లేదు. మంచిగానే రాణిస్తున్నాడు. పంత్ కూడా మంచి ఆటగాడే. అతడు తన బ్యాట్ తో విధ్వంసం సృష్టిస్తాడు.
— BCCI (@BCCI) February 27, 2025
ఇద్దరూ (రాహుల్, పంత్) ఒకే చోట ఉండటంతో పంత్ అన్ లక్కీ. పంత్ ను అడిషనల్ బ్యాటర్ గా తీసుకోవాలని వాదనలు పినిపిస్తున్నాయి. కానీ జట్టులో ఆల్ రౌండర్లు ఉన్నారు. కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్ లో ఖాలీ లేదు. ఏదేమైనా భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్ లో ఉండటాన్ని చూసి ఎంతో గర్వపడుతున్నాను" అని చెప్పుకొచ్చారు.