టీమిండియాకు పంత్ మరో 15 ఏళ్ళు ఆడతాడు: సౌరవ్ గుంగూలీ

ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చాలా బాధపడి ఉంటాడు. ఈ ఒక్క ప్రపంచకప్ ఆడకపోయినా.. రాబోయే రోజులలో చాలా ప్రపంచకప్‌లు ఆడతాడు అని టీమిండియా మాజీ కెప్టెన్, ఢిల్లీ మెంటార్ సౌరవ్ గుంగూలీ పేర్కొన్నారు. తాజాగా గుంగూలీ 'జీ బంగ్లా అండర్-19 ఫుట్ బాల్ లీగ్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పంత్ గురించి గుంగూలీ తన అభిప్రాయాలను తెలిపారు.
'ఎంఎస్ ధోనీ ఎప్పటికీ ఆడలేదు. దినేష్ కార్తీక్ కూడా ఎప్పటికీ ఆడలేదు. రిషబ్ పంత్ మాత్రమే ఆడగలడు, అతనే టీమిండియా ఫ్యూచర్ వికెట్ కీపర్. పంత్ ఇంకా 15-16 ఏళ్ళు క్రికెట్ ఆడగలడు. ఈ ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం పెద్ద సమస్యే కాదు. ఇది అతనికి ముగింపు కాదు. రాబోయే రోజులలో చాలా ప్రపంచకప్‌లు ఆడతాడు' అని గుంగూలీ పేర్కొన్నారు.
'నేను సెలెక్టర్ అయితే.. రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఎంచుకునేవాడిని. దినేష్ కార్తిక్ కూడా మంచి ఆటగాడు. ప్రస్తుతం టీమిండియా జట్టు బాగుంది. జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో రెండు రోజులు బాధపడ్డాడు. అనంతరం కోలుకున్నాడు. పంత్.. ఢిల్లీ బయటి పిచ్ లపై కూడా బాగా ఆడగలడు. బంతి బ్యాట్ పైకి వస్తే మరించ రెచ్చిపోతాడు' అని గుంగూలీ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications