Rishabh Panth vs Dinesh Karthik: గణాంకాల ప్రకారం కార్తీకే బెటర్.. కానీ ప్లేయింగ్ 11లో పంత్‌కే అడ్వాంటేజీ?

ఈ ఏడాది అక్టోబర్, నవంబరులో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ప్లేయింగ్ 11లో రిషబ్ పంత్‌కు అవకాశం దక్కుతుందా దక్కదా అనే విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ 15 మంది సభ్యులుండే జట్టులో వీరిద్దరు ఎంపికైనా తుది జట్టులో ఎవరుంటారు.. ఎవరుండరు అనేదానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ఇకపోతే ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లతో టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియాకప్ లాంటి టీ20 టోర్నీ ప్రపంచకప్ కంటే ముందు ఉండడంతో ఆయా సిరీస్లో ప్రదర్శన ఆధారంగా టీమిండియా తుది జట్టులో ఎవరినీ తీసుకుంటారనే విషయం ఓ కొలిక్కి వస్తుంది.

రాహుల్ ద్రావిడ్ సపోర్ట్‌తో పంత్..
ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన సిరీస్‌లో పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో రిషబ్ పంత్ విమర్శల పాలయ్యాడు. దీంతో అతన్ని ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటికీ సీనియర్ ఆటగాళ్లయిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి రాబోతుండడంతో వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్‌ను కొనసాగించి పంత్‌కు ఉద్వాసన పలికే వీలుందని టాక్ నడుస్తోంది. ఇకపోతే భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్.. ప్రపంచ కప్ జట్టులో పంత్ తప్పకుండా ఉంటాడనేలా స్టేట్‌మెంట్ ఇవ్వడంతో పంత్ కొనసాగే వీలుంది.

కొంపముంచుతున్న రిషభ్ పంత్ నిర్లక్ష్య వైఖరి
దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్ 2-2గా సమమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్లో పంత్ 58పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 105గా ఉంది. ఇక అతని పరుగుల విషయం కంటే అతను ఔట్ అవుతున్నా తీరు పట్ల విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. పదే పదే ఆఫ్ సైడ్ వైడ్ బాల్స్‌ను హిట్ చేయాలని చూస్తూ.. గాల్లోకి క్యాచ్ ఇచ్చి పంత్ ఔట్ అవుతున్నాడు. దీంతో అతనో నిర్లక్ష్యకర బ్యాటర్ అని, తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేడని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా అతని కంటే బెటర్ బ్యాటర్ అయిన దినేష్ కార్తీక్ తుది జట్టులో ఉంటే నయమనే కామెంట్లు జోరందుకున్నాయి

గణాంకాల్లో దినేష్ కార్తీక్‌దే హవా..
పంత్, కార్తీక్ టీ20 ఇంటర్నేషనల్ గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే.. రిషబ్ పంత్ మొత్తం 48ఇంటర్నేషనల్ టీ20లు ఆడి 741పరుగులు చేశాడు. అతని సగటు కేవలం 23.15గా ఉంది. స్ట్రైక్ రేటు 123.91గా ఉంది. ఇక పంత్ మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేయడం కొసమెరుపు. ఇక డీకే విషయానికొస్తే.. 37 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా తరఫున ఆడిన డీకే.. 491 పరుగులు చేశాడు. అతని సగటు 35.07గా ఉంది. స్ట్రైక్ రేటు సైతం పంత్ కంటే బెటర్‌గా 146.13గా ఉంది. ఇక అతని ఖాతాలో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. గణాంకాల ప్రకారం చూసుకున్నా.. పంత్ కంటే దినేష్ కార్తీక్ ఎంతో నయమని తెలుస్తోంది. అందువల్ల తుది జట్టులో దినేష్ కార్తీక్‌నే కొనసాగించే అవకాశలెక్కువగా ఉన్నాయి.

లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం వల్లే పంత్‌కు ఆ ప్రాధాన్యం
ఇక రిషబ్ పంత్‌కు మెయిన్ అడ్వాంటేజీ ఏంటంటే.. అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం.. భారత టీ20 సెటప్‌లో కేఎల్ రాహుల్, కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దినేష్ కార్తీక్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యార్ అందరూ రైట్ హ్యాండర్లే... ఇక ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ మినహా నిఖార్సైన లెఫ్ట్ హ్యాండర్లు టీమిండియాకు ప్రస్తుతం అందుబాటులో లేరు. దీంతో మిడిల్ ఓవర్లలో ఒక లెఫ్టాండర్ అవసరాన్ని సెలెక్షన్ కమిటీ కాస్త సీరియస్‌గా తీసుకుంటున్నట్టుంది. అందుకే రిషబ్ పంత్‌కు కాస్త అధిక ప్రాధాన్యం లభిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications