
టెస్టులు ఆడటం చాలా ఇష్టం:
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో రిషబ్ పంత్ మాట్లాడుతూ... 'నాకు టెస్టులు ఆడటం చాలా ఇష్టం. లాంగ్ ఫార్మాట్‌తోనే టెస్టులకు సంబంధించి ఆటగాళ్ల సామర్థ్యం తెలుస్తుంది. గతంలో నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ టెస్టులు ఆడేటప్పుడు.. లాంగ్ ఫార్మాట్ రియల్ టెస్టు అనేవారు. ఇక ఐదురోజుల టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే మరింతగా శ్రమించాల్సి ఉంటుంది' అని అభిప్రాయపడ్డాడు.

6 గంటల ప్రయాణం చేసి స్టేడియానికి చేరుకునేవాడిని:
'గతంలో సొంతరాష్ట్రం ఉత్తరాఖండ్‌లో క్రికెట్ జట్టు లేదు. ఆ సమయంలో క్రికెట్ ఆడటానికి ఉదయమే రెండు గంటలకు లేచి, బస్సులో ఆరు గంటల ప్రయాణం చేసి స్టేడియానికి చేరుకునేవాన్ని. ఇక శీతాకాలంలో చల్లగా, పొగమంచు కూడా ఉండటంతో చాలా కష్టం అయ్యేది. ప్రయాణం చివరలో లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి అని అనుకునేవాడిని. అప్పట్లో అంత కష్టపడి, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది' అని రిషబ్ పంత్ తెలిపాడు.

కోహ్లీ, ధోనీ సాయం చేశారు:
'టీమిండియాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, సురైశ్ రైనా, శిఖర్ ధావన్ తదితర ఆటగాళ్లు నాకెంతో సాయం చేశారు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆటను మెరుగుపరుచుకున్నా. ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంటే చాలా ఇష్టం. ఇష్టమైన క్రికెటర్ నుంచి నేర్చుకోవాలని కానీ.. వారి ఆటను కాపీ చేయొద్దని గ్రహించా. వారి నుంచి నచ్చిన విషయాలను జీవితంలో, క్రికెట్‌లో అమలు చేయవచ్చు. ఏదేమైనా స్వంత గుర్తింపు ఉండాలి' అని పంత్ చెప్పుకొచ్చాడు.

గాయం కెరీర్‌నే ప్రమాదంలో పడేసింది:
రిషభ్ పంత్ తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన రెండేళ్ల కాలంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాడు. కెరీర్ మొదట్లో ఒక కీలక ఆటగాడిగా ఉన్న పంత్.. ఆ తర్వాత ఫామ్‌ను కోల్పోయి జట్టులో స్థానంపై నమ్మకాన్ని కోల్పోయాడు. పంత్ టాలెంటెడ్ ఆటగాడని చెబుతూ వచ్చిన మేనేజ్‌మెంట్ పెద్దలే అతన్ని పక్కన పెట్టేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో పంత్‌కు అయిన గాయం అతని కెరీర్‌నే ప్రమాదంలో పడేసింది. పంత్ స్థానంలో కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించిన కేఎల్ రాహుల్.. అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కీపర్‌గా రాణించడంతో పంత్ అవసరం లేకుండా పోయింది.


Click it and Unblock the Notifications












