ధోనితో పోల్చుకుని ఒత్తిడికి గురవుతున్న పంత్: అసలు విషయం వెల్లడించిన ఎమ్మెస్కే

హైదరాబాద్: ధోనీకి తాను సరైన వారసుడినని నిరూపించుకునే క్రమంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. ధోని వారసుడిగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పంత్ కెరీర్ తొలినాళ్లలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ... గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు.
ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా విండిస్ పర్యటనకు వెళ్లింది. విండిస్ పర్యటనలో తన పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన రిషబ్ పంత్ ఆ తర్వాత వరుస సిరిస్‌ల్లో విఫలమయ్యాడు. రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన చేస్తున్నప్పటికీ జట్టు మేనేజ్‌మెంట్ అతడికి అండగా నిలుస్తోంది.

త్వరలో ముగియనున్న ఎమ్మెస్కే ప్రసాద్ పదవీ కాలం
ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "రోహిత్, గావస్కర్ ఇద్దరితోనూ నేను ఏకీభవిస్తా. పంత్ కాస్త ఇబ్బందిపడుతున్నాడు. రెండు మూడు మంచి ఇన్నింగ్స్ ఆడితే తన అత్యుత్తమ ఫామ్‌ను అందుకుంటాడు. అతడి గురించి జట్టు యాజమాన్యంతో మాట్లాడా" అని అన్నాడు.

పంత్‌ను స్వేచ్ఛగా ఆడనివ్వాలని
రిషబ్ పంత్‌ను స్వేచ్ఛగా ఆడనివ్వాలని రోహిత్ శర్మ విమర్శకులతో చెప్పగా... టీమిండియాకు ఆడేటప్పుడు ఒత్తిడి తప్పక ఉంటుందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా వంటి జట్టుకు ఆడేటప్పుడు ఒత్తిడి తప్పక ఉంటుందని దానిని అధిగమించినోడే అసలైన విజేత అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

ఒత్తిడి అనేది అంతర్జాతీయ క్రికెట్లో భాగం
"ఒత్తిడి అనేది అంతర్జాతీయ క్రికెట్లో భాగమని పంత్ అర్థం చేసుకోవాలి. ఒత్తిడి నుంచి బయటపడినవాడే నిజమైన విజేత. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. తనకంటూ ఓ గుర్తింపు ఉందని రిషబ్ గ్రహించాలి. అతడు తనను తాను ఎప్పటికీ ధోనీతో పోల్చుకోవద్దు. అతడు అలా పోల్చుకోవడం వల్లే ఇబ్బంది పడుతున్నాడని అనుకుంటున్నా" అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications