న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో వన్డేలో గాయం.. పంత్‌కు తుది జట్టులో వేటుతప్పదా?

Rishabh Pant Suffers Painful Injury After Crashing On To Hoardings

హైదరాబాద్: వెస్టిండీస్‌తో విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో గాయపడిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. సిరీస్ మొత్తానికి దూరం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 36వ ఓవర్ వేసిన స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో పొవెల్ బంతిని బౌలర్ తలమీదుగా గాల్లోకి లేపేశాడు. ఎక్కువ ఎత్తులో బంతి గాల్లోకి లేవడంతో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రిషబ్ పంత్ క్యాచ్ కోసం ప్రయత్నించాడు.

బౌండరీ లైన్‌‌పైకి వెళ్లిపోయిన పంత్

ఈ క్రమంలో బౌండరీ లైన్‌‌పైకి వెళ్లిపోయిన రిషబ్ పంత్.. క్యాచ్‌ని అందుకుని అనంతరం నియంత్రణ కోల్పోయి అక్కడే ఉన్న హోర్డింగ్స్‌ని బలంగా ఢీకొన్నాడు. దీంతో.. అతని చేతి వేళ్లతో పాటు భుజానికి గాయమైంది. ఈ ఘటన తర్వాత ఫిజియోతో పాటు మైదానం వీడిన రిషబ్ పంత్ మళ్లీ ఫీల్డింగ్‌కి రాలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. సిరీస్‌లో మిగిలిన మూడు వన్డేలకీ దూరం కానున్నాడా అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

పంత్ స్థానంలో ఎవరిని తీసుకుంటారో

పంత్ స్థానంలో ఎవరిని తీసుకుంటారో

ఇప్పటికే టీమిండియాలో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో.. ప్రస్తుతం పంత్ స్థానంలో ఎవరిని తీసుకుంటారో వేచి చూడాలి. అయితే మ్యాచ్‌లో పట్టేందుకు ప్రయత్నించిన పంత్.. భుజం దగ్గర.. చేతి వేళ్లకు గాయం తగిలిందంటూ కాసేపు మైదానంలో బాధపడ్డాడు.

రెండో వన్డేలో కలిగిన గాయంతో పంత్

రెండో వన్డేలో కలిగిన గాయంతో పంత్

టెస్టుల్లో పంత్.. పృథ్వీ షా అరంగ్రేట మ్యాచ్‌లతోనే అదిరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పంత్‌పై నమ్మకంతో కోహ్లీ వన్డేల్లోనూ తీసుకున్నాడు. ఈ రెండో వన్డేలో కలిగిన గాయంతో పంత్ ఇదే సిరీస్‌లో ఆడతాడా.. ఆడితే తుది జట్టులోకి అతణ్ని జట్టు తీసుకుంటుందా అనే సందిగ్ధంగా మారింది.

టైగా ముగిసిన మ్యాచ్‌లో కోహ్లీ.. హోప్‌ల సెంచరీలు

టైగా ముగిసిన మ్యాచ్‌లో కోహ్లీ.. హోప్‌ల సెంచరీలు

మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13ఫోర్లు, 4సిక్సులు) అజేయ సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలవడంతో మ్యాచ్ టైగా ముగిసిన విషయం తెలిసిందే.

Story first published: Thursday, October 25, 2018, 16:18 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X