Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బిగ్ షాక్.. హార్దిక్ దెబ్బకు పంత్ విలవిల.. బంతి తగిలి కుప్పకూలిన వికెట్ కీపర్

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. మరో మూడు రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక ప్లేయర్ పంత్ గాయపడ్డాడు. అసలీ గాయం ఎలా తగలింది, ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..

హార్దిక్ దెబ్బకు పంత్ అబ్బా..
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే దుబాయ్‌కు చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించింది టీమిండియా. ఈ క్రమంలోనే ఆదివారం నెట్‌ సెషన్ లో భాగంగా హార్దిక్ పాండ్యా బాదిన బాల్‌ నేరుగా వెళ్లి రిషభ్‌ పంత్‌ ఎడమ మొకాలికి తగిలింది. గతంలో పంత్ కు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అదే మోకాలికి గట్టిగా దెబ్బ తగిలింది. దీంతో పంత్‌ ప్రస్తుతం దెబ్బ తాకగానే అక్కడికక్కడే కుప్పకూలాడు. బంతి బలంగా తాకడంతో అతడు మైదానంలో కాసేపు నొప్పితో విలవిలలాడాడు. తక్షణమే ఫీల్డింగ్‌ కోచ్‌, మెడికల్‌ టీమ్‌ పంత్‌ దగ్గరికి వచ్చి అతడి గాయాన్ని పరిశీలించారు. హార్దిక్ పాండ్యా కూడా పంత్‌ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పాడు.

Rishabh Pant Suffers Knee Injury hit by hardik During Practice Ahead of ICC Champions Trophy 2025

కాస్త ఇబ్బందిగా..
దెబ్బ తగిలిన కాసేపటి తర్వాత మళ్లీ పంత్ ప్యాడ్స్ కట్టుకుని ప్రాక్టీస్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, మునపటిలా ఫ్రీగా అతడు నడిచినట్టుగా కనిపించలేదు. కాస్త ఇబ్బందిగానే నడిచినట్టుగా అనిపించింది. ఏదేమైనా ఈ గాయంతో పంత్ అభిమానులు కాస్త ఆందోళన చెందారు. అతడికి ఏమీ కాకూడదని ప్రార్థించారు. కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీలో పంత్ కన్నా తమ మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహులే అని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, February 16, 2025, 21:00 [IST]
Other articles published on Feb 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+