న్యూజిలాండ్‌తో టీ20 సిరిస్‌కు ముందు హాఫ్ సెంచరీతో చెలరేగిన పంత్

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్-ఏ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 73 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఇండియా-ఏ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో ఇండియా-ఏ జట్టు 4-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ (4/49), దీపక్ చాహర్ (2/38) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ లయన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసి కుప్పకూలింది.
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో పోప్ (65), ములానే (58 నాటౌట్) రాణించారు. అనంతరం 222 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టులో రిషబ్ పంత్ (73 నాటౌట్), హూడా (47 నాటౌట్), కేఎల్ రాహుల్ (42) రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications