
టెస్టు కెప్టెన్‌గా పంత్
టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరనే అంశంపై తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో భారత జట్టు తర్వాతి టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడైనా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. యువ ఆటగాడైనా రిషబ్ పంత్‌కు ఆ అవకాశం ఇవ్వడం ద్వారా భారత జట్టుకు సుదీర్ఘ కాలం పంత్ కెప్టెన్‌గా ఉండడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
అలాగే ఐపీఎల్‌లో రికీ పాంటింగ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తప్పుకున్నప్పుడు రోహిత్ శర్మకు ఆ బాధ్యత అప్పగించారని గవాస్కర్ గుర్తు చేశారు. దీంతో రోహిత్ కెప్టెన్సీతోపాటు బ్యాటింగ్‌లోనూ బాగా రాణించాడని చెప్పుకొచ్చారు. అలాగే రిషబ్ పంత్‌కు కూడా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే కెప్టెన్సీతోపాటు బ్యాటింగ్‌లోనూ మరింత రాణించగలుగుతాడని ఆయన అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ కెప్టెన్‌గా పంత్
24 ఏళ్ల రిషబ్ పంత్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో ఢిల్లీ జట్టు మెరుగ్గా రాణిస్తుంది. 2020లో ఫైనల్ చేరగా.. 2021లో క్వాలిఫైయర్ రౌండ్ వరకు చేరుకుంది. అంతేకాకుండా 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టేబుల్ టాపర్‌గా కూడా నిలిచింది. అంతకు ముందు కెప్టెన్సీ లోపంతో సరిగ్గా రాణించలేకపోయిన ఢిల్లీ జట్టు ప్రస్తుతం రిషబ్ పంత్ కెప్టెన్సీలో సత్తా చాటుతుంది.

పంత్ రికార్డులు
ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా పర్యటనలో తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో విఫలమైన రిషబ్ పంత్ విమర్శల పాలయ్యాడు. అయితే కీలకమైన మూడో టెస్టు మ్యాచ్‌లో మాత్రం అజేయ సెంచరీతో సత్తా చాటాడు. అయితే అతనికి మిగతా వారెవరూ సహకరించకపోవడంతో జట్టుకు భారీ స్కోర్ అందించలేకపోయాడు.
ఇప్పటివరకు తన కెరీర్‌లో 28 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 39 సగటుతో 1735 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 159 పరుగులు. ఇక 18 వన్డే మ్యాచ్‌ల్లో 33 సగటుతో 529 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 78 పరుగులు. కాగా 41 టీ20 మ్యాచ్‌ల్లో 23 సగటుతో 623 పరుగులు చేశాడు. 2 హాఫ్ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోర్ 65 పరుగులు.


Click it and Unblock the Notifications












