
ఇంగ్లీషు గడ్డపై ఇండియా-ఎ తరుపున ఆడిన పంత్
అయితే, ఇంగ్లీషు గడ్డపై పంత్ ప్రదర్శనే అతడికి టెస్టు జట్టులో చోటు దక్కేలా చేసిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మొదటి మూడు టెస్టుల్లో ఆడబోయే 18మంది సభ్యుల జట్టును మాత్రమే బుధవారం ప్రకటించింది. జట్టులో భారీ మార్పులు చేయకుండా, చిన్న సర్దుబాట్లుతోనే టెస్టు జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. అటు దేశవాళీ క్రికెట్‌లో రికార్డులు, ఇటు ఐపీఎల్‌లో అద్భుత ప్రతిభ చూపించిన 20 ఏళ్ల రిషబ్ పంత్‌కు జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు.

ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్
ఇంగ్లాండ్ పర్యటనలో దినేష్ కార్తీక్‌ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు... ఆప్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టులో గాయపడిన వృద్ధిమాన్ సాహా స్థానంలో పంత్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. గాయం కారణంగా వృద్ధిమాన్ సాహా ఇంకొంతకాలం విశ్రాంతిలోనే ఉంటాడు. అంతేకాదు, ఆగస్టులో లండన్ వెళ్లి భుజానికి ఆపరేషన్ చేయించుకోనున్నాడు. దీంతో సాహా ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌తో పాటు నవంబర్‌లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరం కానున్నాడు.

టెస్టుల్లో రిషబ్ పంత్ అరంగేట్రం ఉంటుందా?
దీంతో ఇంగ్లాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టుతో టెస్టు సిరిస్ ఆడబోయే జట్టులో రిషబ్ పంత్ ఒక్కడే అరంగేట్రం కుర్రాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరిస్ కావడంతో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు గాయమైనా లేక ఏదైనా కారణం చేత మ్యాచ్‌లకు దూరమైతే, టెస్టుల్లోకి రిషబ్ పంత్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

అంతా ఊహించినట్టే టెస్టు జట్టులో చోటు
మరోవైపు రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌కు అంతా ఊహించినట్టే టెస్టు జట్టులో చోటుదక్కింది. యో-యో టెస్టులో పాసైన మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ సహా పేసర్ల విభాగంలోకి ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్‌లు వచ్చి చేరారు. ఇక బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మను దూరం పెట్టడం మినహా చెప్పుకోతగ్గ మార్పులేమీ లేవు.


Click it and Unblock the Notifications
