ధావన్‌కు గాయం: ఇంగ్లాండ్‌కు పయనమైన రిషబ్ పంత్

హైదరాబాద్: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్‌కు పయనమయ్యాడు. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్ ధావన్‌కు జట్టు యాజమాన్యం మంగళవారం స్కానింగ్ చేయించింది. దీంతో అతడి వేలి ఎముక చిట్లినట్టు తేలింది. గాయం తీవ్రత దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీంతో అతడు సుమారు మూడు వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. ధావన్ స్థానంలో బీసీసీఐ అధికారికంగా ఎవరినీ ఎంపిక చేయకపోయినప్పటికీ ముందు జాగ్రత్తలో భాగంగా రిషబ్ పంత్‌ను జట్టు మేనేజ్‌మెంట్ ఇంగ్లాండ్‌కు పిలిపించింది. దీంతో రిషబ్ పంత్ ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు.
ధావన్ ఇంగ్లాండ్‌లోనే
ప్రస్తుతం ధావన్ ఇంగ్లాండ్‌లోనే ఉండేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ అనుమతిచ్చింది. దీంతో అతడిని ఇంగ్లాండ్‌లోనే ఉంచి చికిత్స అందించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ మెడికల్ టీమ్ ధావన్ గాయాన్ని పరిశీలిస్తున్నారని.. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కి మాత్రం అతడు దూరం కానున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్‌లో పేర్కొంది.

ఐసీసీ నిబంధన ప్రకారం
ఐసీసీ నిబంధన ప్రకారం గాయపడ్డ ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకుంటే.. ఆ ఆటగాడు మళ్లీ కోలుకున్నప్పటికీ అతడిని జట్టులోకి తిరిగి రావడానికి వీల్లేదు. ధావన్ ఎన్ని రోజులు ఆటకు దూరమవుతాడన్న విషయంలో బీసీసీఐకి కూడా స్పష్టత లేదు. కనీసం మూడు మ్యాచ్‌లకు ధావన్ దూరమవుతాడని వైద్యులు అంచనా వేస్తున్నారు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరం
టోర్నీలో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో, ఆదివారం పాకిస్థాన్‌తో, జూన్ 22న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ధావన్‌కు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు కాబట్టి ఈ మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ 27న వెస్టిండీస్‌తో, 30న ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన తలపడనుంది.
ఇంగ్లాండ్‌కు పయనమైన రిషబ్ పంత్
ఈ మూడు వారాల్లో ధావన్ గనుక కోలుకోని పక్షంలో రిషబ్ పంత్‌ను అతడి స్థానంలో ఎంపిక చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌ను ముందు జాగ్రత్తగా ఇంగ్లాండ్‌కు పిలిపించింది. ధావన్ కోలుకునే అవకాశం లేదని తెలిసినా లేదా టోర్నీలో మరో ఆటగాడు గాయపడితే వెంటనే పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంటారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications