కోహ్లీని చూసి నేర్చుకో: రిషబ్ పంత్‌కు సయ్యద్ కిర్మాణి సూచన

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలచడం నేర్చుకోవాలని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి సూచించాడు. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో ముగిసిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌ల్లో దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ 84 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ సెంచరీ ముంగిట ఔటవ్వడం తనను ఎంతగానో నిరాశకు గురి చేసిందని కిర్మాణి వెల్లడించాడు. ఈ సందర్భంగా కిర్మాణి మాట్లాడుతూ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలచడం ఎలాగో కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు. కిర్మాణి మాట్లాడతూ "రిషబ్ పంత్ హిట్టింగ్‌ని చాలా ఆస్వాదిస్తున్నా. అతను తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే, సెంచరీలు సాధించే టెక్నిక్‌ని మాత్రం అతను నేర్చుకోవాలి" అని అన్నాడు.

రిషబ్ పంత్‌తో కలిసి కోహ్లీ కీలక భాగస్వామ్యం
"వెస్టిండీస్‌తో తొలి టెస్టులో రిషబ్ పంత్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన కెప్టెన్ కోహ్లీ అతని ముందే చక్కగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. పంత్ మాత్రం 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. అంత కష్టం తర్వాత.. సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోకూడదు" అని రిషబ్ పంత్‌కి కిర్మాణీ సూచించాడు.

ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో భారత్ విజయం
కాగా, రాజ్ కోట్ టెస్టులో టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కేవలం రెండన్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టు మ్యాచ్‌లో ముగించడం విశేషం. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది.

టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం
ఫలితంగా భారత్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఇటీవల అప్ఘన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లభించిన ఇన్నింగ్స్ 262 పరుగుల రికార్డును టీమిండియా అధిగమించింది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ ఆటగాళ్లలో కీరన్ పావెల్(83) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు.

రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్
భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా, జడేజా మూడు వికెట్లు సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు రెండు వికెట్లు లభించాయి. అనంతరం వెస్టిండిస్ జట్టుని తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులకే కుప్పకూల్చింది. ఈ టెస్టులో విరాట్ కోహ్లి (139), పృథ్వీ షా (134), రవీంద్ర జడేజా (100 నాటౌట్) సెంచరీలు సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications