IND vs ENG: లీడ్స్ టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ కొట్టి ఆటను ముగించాడు. రిషబ్ పంత్ షాట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకోగానే కేఎల్ రాహుల్ అతని ముందు చేతులు జోడించి కనిపించాడు.
కేఎల్ రాహుల్ ఎందుకు చేతులో జోడించాడు?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల తొలి రోజు ప్రదర్శన ఎవరూ ఊహించని విధంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ యువ భారత జట్టుపై అభిమానుల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా టెస్ట్ సిరీస్‌ను ప్రారంభించిన తీరుతో విమర్శకులందరి నోళ్లు మూతపడ్డాయి. మొదటి రోజు టీమిండియా కేవలం 3 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ప్రస్తుతం నాటౌట్‌గా ఉన్నారు. మొదటి రోజు రిషబ్ పంత్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అర్థ సెంచరీ సాధించాడు. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకోగానే కేఎల్ రాహుల్ పంత్ ముందు చేతులు జోడించి కనిపించాడు.

నిజానికి టెస్ట్ క్రికెట్‌లో రిషబ్ పంత్ తరచుగా ప్రమాదకరమైన షాట్లు ఆడటం కనిపిస్తుంది. రిషబ్ పంత్ షాట్లు చూసి అభిమానులు, జట్టు సభ్యులు కూడా అతను ఔట్ అవుతాడేమోనని చాలాసార్లు భయపడతారు. లీడ్స్ టెస్ట్ మొదటి రోజు చివరి ఓవర్లో పంత్ అలాంటిదే చేశాడు. సాధారణంగా ఆట ముగిసే సమయానికి బ్యాటర్లు జాగ్రత్తగా ఆడటం ప్రారంభిస్తారు. తద్వారా వారి వికెట్ పడకుండా జాగ్రత్త పడతారు. కానీ రిషబ్ పంత్ చివరి ఓవర్లో క్రిస్ వోక్స్ బంతికి సిక్స్ కొట్టాడు. అది వోక్స్‌తో సహా బెన్ స్టోక్స్‌ను కూడా ఆశ్చర్యపరిచింది.
ఆ తర్వాత 65 పరుగులతో నాటౌట్ గా నిలిచిన రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగా రాగానే కేఎల్ రాహుల్ అతని ముందు చేతులు జోడించి కనిపించాడు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్‌లో అంత దూకుడుగా ఉండకూడదని పంత్‌కు తరచుగా సలహాలు వస్తూనే ఉంటాయి. కానీ రిషబ్ పంత్ తాను ఎక్కువ సేపు పెద్ద షాట్లు ఆడకుండా ఉండలేనని నిరూపించాడు.
మొదటి రోజు 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత్ తరఫున మొదటి రోజు కేఎల్ రాహుల్(42 పరుగులు) సాయి సుదర్శన్(0), యశస్వి జైస్వామ్(101 పరుగులు) వికెట్లు పడ్డాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 127, రిషబ్ పంత్ 65 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇప్పుడు రిషబ్ పంత్ నుంచి కూడా అభిమానులు సెంచరీ ఆశిస్తున్నారు.