పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్న రిషభ్ పంత్. తొలుత ధనాధన్ బ్యాటింగ్‌తో స్టార్ డమ్ తెచ్చుకున్నప్పటికీ తర్వాత అదే అతనికి మైనస్ అయ్యింది. టాలెంట్ ఉన్నప్పటికీ పరిస్థితులతో సంబంధం లేకుండా ఆడతాడని, గుడ్డిగా హిట్టింగ్ చేసి వికెట్ పారేసుకుంటాడని పంత్‌పై విమర్శలు వచ్చాయి. నిర్భయమైన ఆటకు, నిర్లక్ష్యమైన బ్యాటింగ్‌కు తేడా తెలియడం లేదని మాజీలు విమర్శించారు. ఈ తరహా ఆట టెస్ట్‌ల్లో పనికిరాదన్నారు. స్పెషలిస్ట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఉండగా.. పంత్‌ను టెస్ట్‌ల్లో ఆడించడం ఎందుకని మరెందరో ప్రశ్నించారు!

పంత్ 2.O

పంత్ 2.O

కానీ ఇదంతా గతం! ఇప్పుడు పంత్ మారాడు. ఫార్మాట్‌కు, మ్యాచ్ పరిస్థితులకు, జట్టు అవసరాలకు తగ్గట్టుగా తన ఆటను మార్చుకున్నాడు. ఆస్ట్రేలియాపై మూడు టెస్ట్‌ల్లో అవకాశం వస్తే.. రెండు మ్యాచ్‌ల్లో గేమ్ చేంజర్‌గా నిలిచాడు. వెయిట్ తగ్గించుకొని, ఫిట్‌నెస్ పెంచుకొని, మానసికంగా మరింత ధృఢంగా మారిన పంత్.. తనలోని కొత్త వెర్షన్‌ను పరిచయం చేశాడు. వరల్డ్ బెస్ట్ కీపర్ బ్యాట్స్‌మన్ అవ్వాలనే తన లక్ష్యం దిశగా అడుగు వేశాడు. ర్యాంక్ పరంగా ప్రస్తుతం అతనే వరల్డ్‌లో నెంబర్ వన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. ఆసీస్‌లో చూపించిన ఓపిక, తెగువను కొనసాగిస్తే తొందర్లోనే ది బెస్ట్ అవడం పక్కా!

4 నెలల్లో 10 కిలోలు తగ్గి..

4 నెలల్లో 10 కిలోలు తగ్గి..

తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చి వెన్ను తట్టిన మేనేజ్‌మెంట్‌కు పంత్ ఎట్టకేలకు ఆసీస్ పర్యటనలో న్యాయం చేశాడు. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దీని వెనుక నాలుగు నెలల కఠోర శ్రమ దాగుంది. ఐపీఎల్ సందర్భంగా తన గేమ్‌ను మెరుగుపరుచుకోవడంపై పంత్ ఫోకస్ పెట్టాడు. లాక్‌డౌన్ టైమ్‌లో సరైన ప్రాక్టీస్ లేక వెయిట్ పెరగడంతో ముందుగా బరువు తగ్గించుకునే పని చేశాడు. ఐపీఎల్ కోసం దుబాయ్ చేరిన వెంటనే ఫిట్‌నెస్ మెరుగుపరుచునేందుకు కఠిన డైట్ ఫాలో అయ్యాడు. ఫలితంగా ఈ నాలుగు నెలల్లో 10 కిలోల బరువు తగ్గి.. ఫిట్‌గా మారాడు.

మానసికంగా బలపడి..

మానసికంగా బలపడి..

ఐపీఎల్ మధ్యలోనే పంత్ మరో నిర్ణయానికి వచ్చాడు. బయటి ప్రపంచాన్ని పట్టించుకోకుండా సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలాగే అతిగా సలహాలు అందుకోకుండా కేవలం కొద్ది మందితో మాత్రమే కనెక్ట్ అయ్యాడు. ఇవన్నీ ఫలితాన్ని ఇచ్చాయి. ఇక తన అత్యుత్సాహాన్ని, టెంపర్‌మెంట్‌ను కూడా పంత్ తగ్గించుకున్నాడు. ఓపికగా క్రీజులో నిల్చోవడం అలవాటు చేసుకున్నాడు. ఐపీఎల్ టైమ్‌లో దుబాయ్‌లో విపరీతమైన హీట్‌లోనూ గంటల తరబడి నెట్ ప్రాక్టీస్ చేశాడు. అన్నింటికంటే ముఖ్యంగా విమర్శలకు, పొగడ్తలకు రెస్పాండ్ కాకుండా తనకు అప్పగించిన పని పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టాడు. తన శ్రమకు ఆసీస్ టెస్ట్ సిరీస్‌లో ఫలితం లభించింది.

చూడ ముచ్చటైన షాట్స్‌తో..

చూడ ముచ్చటైన షాట్స్‌తో..

అద్భుతమైన కవర్ డ్రైవ్స్, పవర్‌ఫుల్ షాట్స్, సయిద్ అన్వర్ మాదిరి కట్ షాట్స్.. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఈజీగా స్వీప్, తన మార్క్ స్కూప్ షాట్స్‌తో కనువిందు చేశాడు. గబ్బాలో అన్ని రకాల షాట్లు ఆడిన పంత్ చాలా ఓపిగ్గా, ప్రశాంతంగా ఆడుతూ టీమ్‌ను గెలిపించి తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. కీపింగ్‌లో మెరుగయ్యాడు. ఓవరాల్‌గా మూడు మ్యాచ్‌ల్లోనే రెండు హాఫ్ సెంచరీలు సహా 274 రన్స్ చేసిన రిషభ్ పంత్ భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. ఆసీస్ టూర్‌లో పంత్ పెర్ఫామెన్స్‌తో టీమ్‌మేనేజ్‌మెంట్ ఖుషీగా ఉంది. ఇకపై కూడా ఇదే జోరు కొనసాగిస్తే రిషభ్‌కు తిరుగుండదు.

పుజారా.. నువ్వు ఆ షాట్ ఆడితే నా సగం మీసం తీసేస్తా: అశ్విన్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, January 26, 2021, 10:56 [IST]
Other articles published on Jan 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X