Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే ఓడిపోయాం : రిషబ్ పంత్

LSG vs DC: ఐపీఎల్ 2025లో 40వ మ్యాచ్ ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్డేడియంలో జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఐడెన్ మార్‌‌క్రమ్ 52 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర తలా ఒక వికెట్ పడగొట్టారు. లక్నో నిర్జేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు కోల్పోయి సులభంగా ఛేదించింది. ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ 57 పరుగులతో భారీ స్కోరర్ గా నిలవగా.. అభిషేక్ పోరెల్ 51 పరుగులు, అక్షర్ పటేల్ 34 పరుగులు చేశారు. లక్నో తరపున ఐడెన్ మార్‌‌క్రమ్ 2 వికెట్ల పడగొట్టాడు. ఈ సారి ఓటమి తర్వాత రిషబ్ పంత్ కీలక ప్రకటన చేశాడు.

ఓటమి తర్వాత రిషబ్ పంత్ ఏమన్నాడంటే?
ఓటమి తర్వాత లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. "మేము 20 పరుగులు వెనుకబడి ఉన్నామని మాకు తెలుసు. టాస్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎవరు ముందుగా బౌలింగ్ చేసినా వికెట్ నుంచి చాలా సహాయం లభిస్తుంది. మేము కొంచెం వెనుకబడ్డామని తెలుసు కానీ దానిని సరిదిద్దలేకపోయాం. లక్నోలో ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ పిచ్ మీద టాస్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ మేము సాకులు వెతకడం లేదు." అని రిషబ్ పంత్ అన్నాడు.

Rishabh Pant Reacts After LSG vs DC Loss We Were 20 Runs Short

మేము ఆయుష్ బధోనితో మ్యాచ్ ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని.. మయాంక్ కు ఇంకా సమయం ఇస్తున్నట్లు రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో అబ్దుల్ సమద్, ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ ను పంపాలనే ఆలోచన వచ్చిందని పంత్ చెప్పాడు. ముందుకు సాగడానికి ఉత్తమ కలయికను కనుగొనడానికి ప్రయత్నించాలని రిషబ్ పంత్ స్పష్టం చేశాడు.

Story first published: Wednesday, April 23, 2025, 0:10 [IST]
Other articles published on Apr 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+