For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్సీ విషయాన్ని జీర్ణించుకోలేని పంత్ రియాక్షన్ ఇదే.. రాహుల్, కుల్దీప్ స్థానంలో సంజూ, తెవాతీయా..!

Rishabh Pant reaction after He selected as captain, and Sanju Samson, Tewatia will replace Rahul, Kuldeep..?

దక్షిణాఫ్రికా సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం రిషబ్ పంత్ యథావిధిగా తన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. ఇంతలో సడెన్‌గా ఓ విషయం రిషబ్ పంత్ చెవిన పడింది. 'కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. ఇక ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వైస్ కెప్టెన్ అయిన నువ్వే ఈ సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్ కాబోతున్నావ్.' అనే విషయం అతనికి బీసీసీఐ ద్వారా తెలిసింది. ఒక్కసారిగా పంత్ స్టన్ అయిపోయాడు. కాసేపు ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఇకపోతే తొలిసారి టీమిండియాకు రిషబ్ పంత్ కెప్టెన్సీ వహించబోతున్నాడు. అది కూడా తన హోం గ్రౌండ్ అయిన ఢిల్లీ స్టేడియంలో అతను కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు. ఇక తానే కెప్టెన్ అనే విషయం తెలిశాక.. రిషబ్ పంత్ ఆనందంగా ఫీలయ్యాడు. కెప్టెన్సీ విషయమై రిషబ్ పంత్ ఇంకా ఏమన్నాడంటే..?

 ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా

ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా

తొలి టీ20 మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో రిషబ్ పంత్ మాట్లాడుతూ.. 'మ్యాచ్‌కు 24గంటల ముందు నేను టీమిండియాను లీడ్ చేయాలనే విషయాన్ని తెలుసుకున్నాను. ఈ విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అత్యుత్తమ కంట్రిబ్యూషన్ ఇస్తానని వాగ్దానం చేస్తున్నా. జట్టులో ఇలా జరగడం కాస్త బాధకరం( కేఎల్ రాహుల్ గాయపడి కెప్టెన్సీ కోల్పోవడం), కానీ ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నమ్మి కెప్టెన్‌గా చేయడం చాలా మంచి అనుభూతి. నేను బీసీసీఐ నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. భారత జట్టుకు నాయకత్వం వహించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నేను తప్పకుండా యుటిలైజ్ చేసుకుని ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తాను. నా క్రికెట్ కెరీర్ మరింత ఉన్నతంగా మారేందుకు ప్రతిరోజు ప్రయత్నిస్తాను.' అని పంత్ పేర్కొన్నాడు.

వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా

వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా

ఇక దక్షిణాఫ్రికా సిరీస్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనుండగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక గాయపడిన రాహుల్, కుల్దీప్ స్థానాల్లో సెలెక్షన్ కమిటీ ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇక రాహుల్ స్థానంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సంజూ శాంసన్. ఇప్పటికే టీ20 జట్టులో సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ మీద పెద్దఎత్తున కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సంజూ శాంసన్‌ను రాహుల్ స్థానంలో తీసుకోవాలంటూ ట్విట్టరులో నెటిజన్లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇక బీసీసీఐ సైతం ధావన్, శాంసన్‌లలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసే అవకాశముంది. ఇక కుల్దీప్ యాదవ్ స్థానంలో స్పిన్నర్‌కు బదులు స్పిన్నర్ కమ్ ఫినిషర్ రాహుల్ తెవాతీయా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.

దక్షిణాఫ్రికా సిరీస్ కోసం అప్డేటెడ్ భారత టీ20 జట్టు:

రిషబ్ పంత్ (కెప్టెన్) (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్నోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

ఎంపికయ్యే అవకాశమున్న ప్లేయర్లు : సంజూ శాంసన్, రాహుల్ తెవాతీయా,

Story first published: Wednesday, June 8, 2022, 21:48 [IST]
Other articles published on Jun 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+