Rishabh Pant Pushed Kuldeep Yadav: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పెద్దగా ఏమీ రాణించలేదు. తన మాజీ ఐపీఎల్ జట్టుతో ఆడుతున్న రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. తన కెప్టెన్సీ సమయంలో కొన్ని పెద్ద తప్పులు కూడా చేశాడు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి ఓవర్‌లో లక్నో సూపర్ సూపర్ జెయింట్స్ ను ఒక వికెట్ తేడాతో ఓడించింది.
చివరి క్షణాల్లో మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో రెండు జట్లపై ఒత్తిడి ఉంది. వీటన్నింటి మధ్య రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ స్టేడియంలో సరదాగా కనిపించారు. వారిద్దరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రిషబ్ పంత్ కుల్దీప్ ను క్రీజులో నుంచి తోస్తున్నట్లు కనిపిస్తోంది.

కుల్దీప్ యాదవ్‌ను క్రీజు నుంచి బయటకు నెట్టేసిన రిషబ్ పంత్
లక్నో తరఫున రవి బిష్ణోయ్ 18వ ఓవర్ వేస్తున్నాడు. రవి బిష్ణోయ్ వేసిన ఓవర్ రెండో బంతిని కుల్దీప్ యాదవ్ కొట్టబోయాడు. కానీ ఆ బంతి వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతిలోకి వెళ్లింది. అతను స్టంప్స్ పైకి కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ కుల్దీప్ క్రీజులోనే ఉన్నాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ సరదాగా కుల్దీప్ ను క్రీజు నుంచి బయటకు నెట్టేసి వికెట్స్ పై ఉన్న బెయిల్స్ కింద పడేశాడు. ఇద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాచ్ పరిస్థితి ఇలా..
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. నికోలస్ పూరన్(75), మిచెల్ మార్ష్(72) చెలరేగి ఆడడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కు 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ జట్టు మొదట్లో తడబడింది. కానీ ఈ ఉత్కంఠభరిత పోరులో చివరకు ఢిల్లీ మ్యాచ్ గెలిచింది. చివరి ఓవర్ లో అశుతోష్ శర్మ(66*) సిక్సర్ బాదడంతో మూడు 3 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ విజయం సాధించింది.