రిషబ్ పంత్ కొత్త బెంజ్ కారు: వందకు పైగా వేగంతో (వీడియో)
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో అద్భుత ఆటతీరుని కనబరిచిన యువ ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరుపున ఆడిన రిషబ్ పంత్ మొత్తం 14 మ్యాచ్‌లలో 366 పరుగులు సాధించాడు.
ఇటీవలే ఐపీఎల్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ద్వారా పంత్ సంపాదించిన డబ్బుని అప్పుడే ఖర్చు చేశాడు. 19 ఏళ్ల పంత్ తాజాగా మెర్సిడెజ్ బెంజ్ జీఎల్‌సీ ఎస్‌యూవీ కారుని కొనుగోలు చేశాడు. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
కొత్త కారుని కొనుగోలు చేసిన పంత్
ఢిల్లీలోని మెర్సిడిస్ షో రూంలో కొత్త కారుని కొనుగోలు చేసిన యువ ఆటగాడు రిషబ్ పంత్.
కారు ముందు ఫోటోకు ఫోజు
తాను కొనుగోలు చేసిన కొత్తి కారు ముందు ఫోటోలకు ఫోజులిచ్చిన రిషబ్ పంత్
పంత్‌కు అభినందనలు
మెర్సిడిస్ బెంజ్ జీఎల్‌సీ ఎస్‌యూవీ కారుని కొనుగోలు చేసిన సందర్భంలో పంత్‌కు అభినందనలు తెలుపుతున్న షోరూం.
కొత్త కారుని వేగంగా నడుపుతున్న పంత్
మెర్సిడెజ్ బెంజ్ జీఎల్‌సీ ఎస్‌యూవీ కారుని కొనుగోలు చేశాడు. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

ఐపీఎల్ 10లో అద్భుత ప్రదర్శన చేసిన పంత్
ఐపీఎల్ 10 సీజన్‌లో రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. పదో సీజన్‌లో వెలుగులోకి వచ్చిన ఎమర్జింగ్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. 14 మ్యాచ్‌లాడిన పంత్ 26.14 యావరేజితో 366 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం ఆరింటిలో మాత్రమే విజయం సాధించింది. గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ 97 పరుగులతో తృటిలో సెంచరీని మిస్సయ్యాడు. కేవలం 43 బంతుల్లో ఆరు ఫోర్లు, 9 సిక్సులతో ఈ స్కోరు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications