Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs West indies: రిష‌బ్ పంత్‌కు వైస్ కెప్టెన్‌గా ప్ర‌మోష‌న్.. మరోవైపు టీమిండియాకు గాయాల‌ బెడ‌ద‌

Rishabh Pant promoted to Team India Vice-Captain for T20 Series against West Indies

కోల్‌క‌తా: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు వికెట్ కీప‌ర్ రిష‌బ్‌పంత్‌కు ప్ర‌మోష‌న్ ల‌భించింది. విండీస్‌తో 3 మ్యాచ్‌ల పొట్టి ఫార్మాట్‌కు రిష‌బ్ పంత్‌ను సెలెక్ట‌ర్లు టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియ‌మించారు. ముందుగా వైస్ కెప్టెన్‌గా నియ‌మించిన కేఎల్ రాహుల్ గాయంతో టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. దీంతో ఆ స్థానంలో భ‌విష్య‌త్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఇప్ప‌టికే మ‌న్న‌న‌లు అందుకుంటున్న రిష‌బ్ పంత్‌కు అవకాశం ల‌భించింది. కాగా గాయం కార‌ణంగా కేఎల్ రాహుల్ విండీస్‌తో మూడో వ‌న్డే మ్యాచ్‌కు కూడా దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రో వైపు విండీస్‌తో సిరీస్‌లో టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే గాయాల కార‌ణంగా కేఎల్ రాహుల్, అక్ష‌ర్ ప‌టేల్ క‌రేబియ‌న్ల‌తో టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యారు. తాజాగా ఈ జాబితాలో ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ కూడా చేరిపోయాడు. గాయంతో సుంద‌ర్ కూడా టీ20 సిరీస్‌కు దూర‌మయ్యాడు. ఈ కార‌ణంగానే సుందర్ సోమ‌వారం ప్రాక్టీస్ కూడా చేయ‌లేదు. కాగా గాయంతో వాషింగ్ట‌న్ సుంద‌ర్ టీ20 సిరీస్‌కు దూర‌మ‌వుతున్న‌ట్లు బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించింది.

సుంద‌ర్ స్థానంలో జ‌యంత్ యాద‌వ్‌ను జ‌ట్టులో చేర్చింది. ఇక ఇప్ప‌టికే గాయ‌ప‌డ్డ కేఎల్ రాహుల్, అక్ష‌ర్ ప‌టేల్ స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, దీప‌క్ హుడా జ‌ట్టులోకి వ‌చ్చారు. కాగా గాయ‌ప‌డిన కేఎల్ రాహుల్, అక్ష‌ర్ ప‌టేల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో ఏర్పాటు చేసిన రిహాబిలిటేష‌న్ క్యాంపులో ఉన్నారు.

ఇక ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను 3-0తో గెలిచి జోరు మీదున్న రోహిత్ సేన టీ20 సిరీస్‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ మేర‌కు సిరీస్ జ‌ర‌గ‌నున్న కోల్‌క‌తాలో ఈడెన్ గార్డెన్స్ మైదానానికి చేరుకోని ప్రాక్టీస్ కూడా మొద‌లుపెట్టింది. కాగా వెస్టిండీస్, భార‌త్ మ‌ధ్య ఈ నెల 16, 18, 20వ తేదీల‌లో 3 టీ20 మ్యాచ్‌లో జ‌ర‌గ‌నున్నాయి.

టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), రిషబ్ పంత్(వైస్ కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్‌, య‌జ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, దీప‌క్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, జ‌యంత్ యాద‌వ్‌, సూర్యకుమార్ యాదవ్.

Story first published: Tuesday, February 15, 2022, 7:45 [IST]
Other articles published on Feb 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+