For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రేమలో పడిన పంత్!: అమ్మాయి ఎవరో తెలుసా? (ఫోటోలు)

India vs Australia : Rishab Pant Posts About His Love LIfe In Instagram | Oneindia Telugu
Rishabh Pant posts photo with girlfriend Isha Negi. Fans cant keep calm

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై శతకం నమోదు చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ రికార్డు సృష్టించడంతో పాటు నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో మొత్తం 350 పరుగులు చేశాడు.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో మాటల యుద్దానికి దిగి ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచాడు. టెస్టు సిరీస్‌ అనంతరం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌ల నుంచి విశ్రాంతి లభించిన నేపథ్యంలో ఖాళీ సమయాన్ని పంత్‌ ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో రిషభ్‌ పంత్‌ ప్రేమలో పడ్డాడు.

బుధవారం 'ఇన్‌స్టాగ్రామ్‌'లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేశాడు. దీనిపై 'నేను సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వు...నిన్ను కూడా సంతోషంగా ఉంచడమే నేను చేయాల్సింది' అని క్యాప్షన్ ఇచ్చాడు.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా. ఆమె పేరు ఇషా నేగి. ఆమె ఓ వ్యాపారవేత్త.. ఇంటీరియర్ డిజైనర్. ఆమె కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే ఫొటోను షేర్ చేస్తూ "నా మనిషి, నా సోల్‌మేట్, నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రియుడు" అంటూ ఆమె అసలు విషయాన్ని బయటపెట్టేసింది. దీంతో పంత్ ప్రేమలో పడ్డాడంటూ సోషల్ మీడియాలో అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Thursday, January 17, 2019, 12:43 [IST]
Other articles published on Jan 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+