For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్ బాబు, ఊర్వశి పాప మధ్య తగ్గని రగడ.. ఇన్‌స్టా స్టోరీతో మళ్లీ చిచ్చు రాజేసిన పంత్..!

Rishabh Pant Posted A Satirical Quote On Instagram Story.. It looks A Counter to Urvasi Rautela

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా మధ్య కొన్నాళ్లుగా వర్డ్స్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. పాపులారిటీ కోసం ఊర్వశి పాప పాపం పిచ్చి మాటలతో పాకులాడుతుందని పంత్ పరోక్షంగా వారించగా.. రౌటెలా సైతం తగ్గేది లేదని మరో కౌంటర్ ఇచ్చింది. ఓ చోటు బ్రదర్.. పోయి సక్కగా బ్యాట్ బాల్ ఆడుకో.. ఎక్స్ ట్రాలు చేస్తే మంచిగుండది.. సైలెంట్‌గా ఉన్నానని రెచ్చిపోతే బండారం బయటపెడతా అంటూ పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు వీరిద్దరి వ్యవహారం చాలా హాట్ టాపిక్‌గా మారగా.. తాజాగా పంత్ మరోసారి క్రిప్టిక్ ఇన్ స్టా స్టోరీ పెట్టాడు.

అప్పట్లో కోడై కూసిన బాలీవుడ్ మీడియా

ఊర్వశి రౌటెలాతో రిషభ్ పంత్ రిలేషన్‌లో ఉన్నాడని గతంలో వార్తలు షికారు చేశాయి. వీళ్లిద్దరు చక్కర్లు కూడా కొట్టారని కూడా బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ అనూహ్యంగా పంత్ ఈ పుకార్లకు తనదైన స్టయిల్లో ఫుల్‌స్టాప్ పెట్టాడు. సోషల్ మీడియాలో ఊర్వశి రౌటెలాను బ్లాక్ చేశాడు. అప్పట్లో ఇదో పెద్ద న్యూస్ అయింది. తర్వాత ఇషా నేగి అనే మోడల్‌తో పంత్ ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇంతవరకు బానే ఉన్నా ఊర్వశి రౌటెలా మాత్రం అప్పుడప్పుడు పంత్‌ మీద తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది.

ఏంటీ పాప అన్నావ్.. మరోసారి అను

ఏంటీ పాప అన్నావ్.. మరోసారి అను

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను వారణాసిలో ఓ షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత ఢిల్లీకి వచ్చానని.. అలసిపోయి హోటల్‌లో పడుకున్న తనను కలవడానికి మిస్టర్ ఆర్పీ (రిషబ్ పంత్) వచ్చాడని, 17సార్లు ఫోన్ కూడా చేసినా నేను పడుకోవడంతో లిఫ్ట్ చేయలేకపోయానని ఊర్వశి తెలిపింది. ఆ తర్వాత ముంబైకి వెళ్లినప్పుడు కలిసానని, కానీ తర్వాత అతను తనతో మాట్లాడటం మానేసాడని చెప్పింది. దీనిపై పంత్ స్పందించాడు. ఏంటీ పాప అన్నావ్.. మరోసారి అను అంటూ ఆమె పాపులారిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుందని, అందుకే తన పేరును చెప్పకుండానే చెప్పి నంగనాచి డ్రామాలు ఆడుతుందనే రీతిలో పంత్ కౌంటర్లు ఇచ్చాడు. పాపులారిటీ కోసం పచ్చి అబద్ధాలు ఆడడం ఎంత ఫన్నీగా ఉంటుందో.. వాళ్లను చూస్తే జాలేస్తుంది. పాపం వాళ్లను దేవుడే కాపాడాలి అంటూ పంత్ తన ఇన్‌స్టా స్టోరీ రాసుకొచ్చాడు. ఇక ఊర్వశి ఈ స్టోరీ తర్వాత చోటు బ్రదర్ నువ్వు బ్యాట్ బాల్ ఆడుకో అంటూ ట్వీట్ చేసింది. ఇక ఇంతటితో ఇది ముగిసిపోతుందని అనుకుంటే మళ్లీ పంత్ ఈసారి ఓ డిఫెరెంట్ స్టైల్లో రెస్పాండ్ అయ్యాడు.

ఊర్వశి రౌటెలాపై రిషభ్ పంత్ ఫైర్,పాపులారిటీ కోసం ఇంత దిగజారతారా? *Cricket | Telugu OneIndia
పాప మరీ ఎలా పంచ్ ఇస్తుందో..?

పాప మరీ ఎలా పంచ్ ఇస్తుందో..?

ఇక తన ఇన్ స్టా స్టోరీలో డోన్ట్ స్ట్రెస్ ఓవర్ వాటు యు కెన్ నాట్ కంట్రోల్ అంటూ ఓ కొటేషన్ కోట్ చేశాడు. మీ ఆధీనంలో లేని విషయాల గురించి పెద్దగా చింతించొద్దు.. లిటరల్లీ చెప్పాలంటే.. మనం కంట్రోల్ చేయలేని కొన్ని విషయాలను ఈ చెవిలో నుంచి విని ఈ చెవిలోనుంచి వదిలేయాలని పంత్ పేర్కొన్నాడు. ఇది ఊర్వశి రౌటెల గురించే అని స్పష్టంగా అర్థమవుతంది. ఊర్వశి పాపను, ఆమె వాగుడును మనం కంట్రోల్ చేయలేమని.. దాని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన పనిలేదని దీని ఇన్నర్ మీనింగ్ అని పంత్ చెప్పకనే చెప్పాడు. ఇక పంత్ బాబుకు.. ఊర్వశి పాప ఎలా పంచ్ ఇస్తాదో మరీ.

Story first published: Sunday, August 14, 2022, 13:56 [IST]
Other articles published on Aug 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+