India vs South Africa:ధోని రికార్డుకు ఎసరు పెట్టిన పంత్! అలాగే షమీ, బుమ్రా కూడా..

ఆదివారం నుంచి సౌతాఫ్రికా, భారత్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. బాక్సింగ్ డే సందర్భంగా సెంచురియన్ వేదిగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌కు విదేశాల్లో ఇదే తొలి సవాల్. దీంతో ద్రావిడ్ ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మంగా తీసుకున్నాడు. దానికి తగ్గట్టే టీంను సిద్ధం చేస్తున్నాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ డూ ఆర్ డై అలాంటింది. ఇప్పటికే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లీకి టెస్ట్ కెప్టెన్సీ నిలబడాలంటే ఈ సిరీస్ గెలవాల్సిందే. అంతేకాకుండా బ్యాటర్‌గాను ఈ సిరీస్‌లో కోహ్లీ సత్తా చాటాల్సిన అవసరం ఉంది.
కొంత కాలంగా కోహ్లీ బ్యాటింగ్‌లో పరుగులు చేయని విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లను రికార్డులు ఊరిస్తున్నాయి. టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీతోపాటు మరో బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తమ తమ కెరీర్‌లోని రికార్డులకు చేరువలో ఉన్నారు. ఆ రికార్డులను ఈ సిరీస్‌లో అందుకునేందుకు ఈ ముగ్గురికి ఎక్కువగా సమయం పట్టకపోవచ్చు.

డబుల్ సెంచరీకి చేరువలో షమీ
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌లో ఓ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 54 టెస్టు మ్యాచ్‌లు ఆడిన షమీ 195 వికెట్లు పడగొట్టాడు. దీంతో మరో 5 వికెట్లు తీస్తే షమీ ఖాతాలో 200 వికెట్లు చేరతాయి. తద్వారా టెస్టు క్రికెట్‌లో 200 వికెట్ల క్లబ్‌లో చేరిన టీమిండియా ఐదో పేస్ బౌలర్‌గా షమీ అరుదైన ఘనత సాధిస్తాడు. షమీ కంటే ముందు కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జవగళ్ శ్రీనాథ్ మాత్రమే భారత్ తరఫున 200 వికెట్లు తీశారు.

సెంచరీకి చేరువలో బుమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జప్రీత్ బుమ్రాపై ఈ సారి సౌతాఫ్రికా పర్యటనలో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే విదేశాల్లో ఓ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు విదేశాల్లో 22 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 97 వికెట్లు పడగొట్టాడు. మరో 3 వికెట్లు పడగొడితే విదేశాల్లో 100 వికెట్లు తీసిన భారత పేసర్ల లిస్టులో బుమ్రా చేరుతాడు. కాగా కెరీర్‌లో ఇప్పటివరకు 24 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 101 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే స్వదేశంలో ఆడిన బుమ్రా 4 వికెట్లు తీశాడు.

ధోని రికార్డుపై పంత్ గురి
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏకంగా భారతీ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డుపైనా గురి పెట్టాడు. ఇప్పటివరకు 25 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పంత్.. వికెట్ కీపర్‌గా 97 మందిని ఔట్ చేశాడు. ఇందులో 89 క్యాచ్‌లు. 8 స్టంపౌట్లు కూడా ఉన్నాయి. దీంతో పంత్ మరో ముగ్గురిని ఔట్ చేస్తే 100 మందిని ఔట్ చేసిన కీపర్‌గా నిలుస్తాడు. అయితే దిగ్గజ కీపర్ మహేంద్ర సింగ్ ధోని టెస్టులో 100 మందిని ఔట్ చేయడానికి 36 మ్యాచులు ఆడాల్సి వచ్చింది. దీంతో ఈ సిరీస్‌లో పంత్ మరో ముగ్గురిని ఔట్ చేస్తే అత్యంత వేగంగా 100 మంది బ్యాటర్లను ఔట్ చేసిన కీపర్‌గా ధోని రికార్డును బద్దలు కొడతాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications