ఆరేళ్ల అభిమాని కోరిక తీర్చిన పంత్.. పెద్ద మనసుకు ఫ్యాన్స్ ఫిదా!

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. గతేడాది చివర్లో భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగి ఆటకు దూరమైన అతను అభిమానులకు మాత్రం తను ఎప్పుడూ దగ్గరే అని నిరూపించుకున్నాడు. ఇటీవలే ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలు పలు శస్త్రచికిత్సలు చేయించుకున్న పంత్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి అతను త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
హే రిషభ్ పంత్..
ఇటీవలే ఆస్పత్రిలో నుంచి బయటకు వచ్చిన పంత్.. సూర్యోదయం చూస్తూ ఎమోషనల్ అయ్యాడు. 'అలా ప్రశాంతంగా కూర్చొని ఊపిరి పీల్చుకోవడం ఇంత సంతోషంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు' అని పోస్టు పెట్టాడు. అది చూసిన చాలా మంది అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. తాజాగా సువాజిత్ ముస్తాఫీ అనే ట్విట్టర్ యూజర్ కూడా పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు.
అయితే దాంతోపాటు మరో చిన్న రిక్వెస్ట్ చేశాడు. 'హే రిషభ్ పంత్, నీ రికవరీ ప్రాసెస్ అంతా స్మూత్‌గా సాగుతోందని ఆశిస్తున్నా. మా అబ్బాయి అయాన్ నీకు చాలా పెద్ద ఫ్యాన్' అంటూ ట్వీట్ మొదలు పెట్టాడు.
ఆరేళ్ల పంత్ వీరాభిమాని..
ఆ తర్వాత కొనసాగిస్తూ.. 'నీలాగే లెఫ్ట్ హ్యాండర్ కూడా. ఎప్పటికైనా నీలా అవ్వాలని కోరుకుంటున్నాడు. డిసెంబర్ 30 నుంచి నువ్వు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాడు. ఈ రోజు తన 6వ బర్త్‌డే. కొంచెం తనకు బర్త్‌డే విషెస్ చెప్పగలవా? ప్లీజ్' అని ట్వీట్ చేశాడు. దీంతోపాటు అయాన్ లెఫ్ట్ హ్యాండ్ షాట్ ఒకటి ఆడి, 'నేను పంత్‌లా ఆడతా' అంటున్న వీడియోను కూడా షేర్ చేశాడు.
సాధారణంగా ఇలా అభిమానులు చేసిన ట్వీట్లు సెలెబ్రిటీల దృష్టికి వెళ్లవు. కోట్లాది మంది చేసే ట్వీట్లలో ఇలాంటివి వాళ్లు వెతుకుతూ ఉండరు కదా. అయితే అయాన్ అదృష్టం బాగుండి ఈ ట్వీట్ పంత్ కంట పడింది.

మిస్ అవుతున్న ఫ్యాన్స్..
దీంతో వెంటనే స్పందించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ వికెట్ కీపర్.. 'హ్యాపీ బర్త్‌డే అయాన్. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు. దీంతో సువాజిత్ చాలా సంతోషించాడు. నెటిజన్లు కూడా పంత్ పెద్ద మనసుకు ఫిదా అయిపోయారు. తను ఆస్పత్రిలో ఉన్నా కూడా అభిమానుల గురించి ఆలోచించే అతని మంచి మనసును శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.
అలాగే త్వరగా కోలుకొని టీమిండియాలోకి రావాలని, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అతన్ని బాగా మిస్ అవుతున్నామని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. పంత్ గైర్హాజరీలో ఆసీస్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications