Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ ట్వీట్: పంత్ ఆడిన ఈ షాట్ పేరేంటో చెప్పగలరా? (వీడియో)

India vs New Zealand : BCCI Has Posted A Shot Of Rishabh Panth In Twitter | Oneindia Telugu
Rishabh Pant joins Team India in New Zealand to gear up for T20I series

హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు మూడు టీ20ల సిరిస్‌కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టీ20 మ్యాచ్‌తో ఇరు జట్ల మధ్య ఈ సిరిస్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ కోసం ధోనితో పాటు దినేశ్‌ కార్తీక్‌, రిషబ్ పంత్‌కు కూడా సెలక్టర్లు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే.

నెట్స్‌లో శ్రమిస్తోన్న రిషబ్ పంత్

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌కు చేరుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మంగళవారం నెట్స్‌‌లో తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్‌ ప్రాక్టీస్‌లో భాగంగా రిషబ్ పంత్ ఆడిన ఓ షాట్‌ను బీసీసీఐ తన అధికారిక ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది. ఫాస్ట్‌ బౌలర్‌ వేసిన లెంగ్త్‌ బాల్‌ను బ్యాట్‌ తిప్పి మరీ వికెట్ల వెనుకకు ఆడాడు. ‘ఈ షాట్‌కు మీరు ఏ పేరు పెడతారు' అంటూ బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

విపరీతంంగా ఆకట్టుకుంటోన్న షాట్

విపరీతంంగా ఆకట్టుకుంటోన్న షాట్

బౌలర్ వేసిన బంతిని పంత్ వికెట్ కీపర్ వెనుకాలకు తరలించిన షాట్ నెటిజన్లను విపరీతంంగా ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లే ముందు పంత్ ఇండియా-ఎ జట్టు తరఫున రెండు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో ఒక మ్యాచ్‌లో 73 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇండియా-ఎ 6 వికెట్లతో గెలిచింది.

బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తొలి టీ20

బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తొలి టీ20

బుధవారం జరగబోయే తొలి టీ20 మ్యాచ్ కోసం రిషబ్ పంత్‌తోపాటు దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, పాండ్యా, కుల్దీప్, ధోని, రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. వెల్లింగ్టన్‌ వేదికగా బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఆరంభం కానుంది.

న్యూజిలాండ్‌తో టీ20 సిరిస్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, ధోని(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్ధ్ కౌల్, ఖలీల్ అహ్మద్, శుభమాన్ గిల్, విజయ్ శంకర్, హార్ధిక్ పాండ్యా

1
44085
Story first published: Tuesday, February 5, 2019, 14:52 [IST]
Other articles published on Feb 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+