T20 World Cup 2022: జట్టులోకి రిషబ్ పంత్.. టాస్ గెలిచిన భారత్..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో జింబాబ్వేతో జరగుతున్న మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో జట్టులో ఒక్క మార్పు చేశారు. దినేక్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ ను తీసుకున్నారు. అయితే గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ కు వెళ్లాయి. నెదర్లాండ్స్ పై సౌతాఫ్రికా ఓడిపోవడంతో ఇండియా సెమీస్ కు వెళ్లడం పక్కా కాగా.. బంగ్లాదేశ్ పై గెలిచిన పాక్ సెమీస్ కు దూసుకెళ్లింది.

భారత్, పాక్
గ్రూప్-2లో పాకిస్థాన్ 6 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇండియా కూడా 6 పాయింట్లు ఉన్నాయి. కానీ రన్ రేటు తక్కువగా ఉంది. దీంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, జింబాబ్వే ఇంటిముఖం పట్టాల్సిందే.

భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్ష్ దీప్ సింగ్,

జింబాబ్వే జట్టు
వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్(సి), రెగిస్ చకబ్వా(w), సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోనీ మునియోంగా, ర్యాన్ బర్ల్, టెండై చటారా, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications