IPL 2023: రిషబ్ పంత్, బుమ్రా స్థానంలో ఆ ఆటగాళ్లను తీసుకున్న జట్లు..
ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్ ను తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో సందీప్ వారియర్ ను తీసుకున్నారు. రిషబ్ పంత్ గత సంవత్సరం డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను ఇప్పటికీ కోలుకోకపోవడంతో అతని స్థానంలో మరోకల్ని తీసుకోవాల్సి వచ్చింది. బుమ్రా కూడా గాయపడి జట్టుకు దూరమయ్యాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆసియా కప్‌లో కూడా అతను ఆడలేదు.
వికెట్ కీపర్-బ్యాటర్ అయిన పోరెల్, బెంగాల్ తరపున 3 లిస్ట్ Aతో పాటు 16 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, అనేక T20లు ఆడాడు. సందీప్ వారియర్ 68 T20లు ఆడి 62 వికెట్లు పడగొట్టాడు. అతను గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తరపున 5 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడుా.

పోరెల్ ను ఢిల్లీ రూ.20 లక్షలకు దక్కించుకోగా.. ముంబై ఇండియన్స్ సందీప్ వారియర్ ను రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది.ఏప్రిల్ 2న బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RCBతో జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
గత ఆదివారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో తన ఎంఐ సహచరులతో కలిసి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌ను వీక్షించిన బుమ్రా, ఇంగ్లండ్ పేస్ సంచలనం జోఫ్రా ఆర్చర్‌తో మాట్లాడడం చూశాం. ఈ ఇద్దరితో రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు రజత్ పాటిదార్ కూడా గాయపడ్డాడు. అతను ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ కు దూరమయ్యాడు. విల్ జక్స్ గాయపడడంతో అతని స్థానంలో బ్రెస్ వెల్ తీసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ప్రసిద్ద్ కృష్ణ కూడా గాయపడ్డారు. అతని స్థానంలో సందీప్ శర్మను తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications