For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సందేహమే లేదు.. పంత్ ఓ సూపర్ స్టార్'

India vs West Indies 2018, 2nd Test : Rishabh Pant Is Going To Be A Superstar | Oneindia Telugu
Rishabh Pant is going to be a Superstar, predicts Michael Vaughan

న్యూ ఢిల్లీ: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ టెస్టు క్రికెట్‌లో సంచలన ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు. ఆచితూచి ఆడుతూనే అంది వచ్చిన బంతుల్ని ఏకంగా భారీ సిక్సర్లుగా మలుస్తున్నాడు. తనదైన రీతిలో స్లాగ్‌స్వీప్‌తో బౌండరీలు బాదుతున్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల్లోనూ అతడి ప్రదర్శన ఆకట్టుకుంది.

 పంత్‌ను ప్రశంసిస్తోన్న మైకేల్‌ వాన్‌

పంత్‌ను ప్రశంసిస్తోన్న మైకేల్‌ వాన్‌

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు రహానె (80)తో కలిసి 146 పరుగుల కీలక భాగస్వామ్యం అందించాడు. 92 పరుగుల వద్ద ఔటవ్వడంతో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. టెస్టుల్లో మెరుపులు మెరిపిస్తున్న రిషబ్‌ పంత్‌ను ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ అభినందించాడు.

సందేహమే లేదు. పంత్‌ ఒక సూపర్‌స్టార్‌

అతడిలో ఒక సూపర్‌స్టార్‌ కనిపిస్తున్నాడని ప్రశంసించాడు. ‘సందేహమే లేదు. రిషబ్‌ పంత్‌ ఒక సూపర్‌స్టార్‌ కాబోతున్నాడు'అని ట్వీట్‌ చేశాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడగలడు.

 వరుసగా రెండు టెస్టుల్లోనూ పంత్‌ 90+

వరుసగా రెండు టెస్టుల్లోనూ పంత్‌ 90+

చివరి టెస్టులో అతడి శతకం అద్భుతం. దీంతో ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదిన భారత తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ కూడా సిరీస్‌లో తక్కువగా ఏమీ ఆడలేదు. వరుసగా రెండు టెస్టుల్లోనూ పంత్‌ 90+ స్కోర్లు చేశాడు. రెండో రోజు ఓవైపు రహానె సింగిల్‌ తీయడానికి ఇబ్బంది పడుతున్నా.. పంత్‌ మాత్రం రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశాడు.

 వన్డే ఆటతీరుతో రహానెకు ధైర్యాన్నిస్తూ..

వన్డే ఆటతీరుతో రహానెకు ధైర్యాన్నిస్తూ..

వన్డే తరహా ఆటతీరుతో రహానెకు ధైర్యాన్నిస్తూ.. టీమిండియాలో ఆత్మవిశ్వాసం నింపాడు. క్రీజులో కుదురుకోగానే సిక్సర్లతో చెలరేగాడు. తన ప్రదర్శనతో షా, పంత్‌ ఆస్ట్రేలియా పర్యటనకు దాదాపుగా టిక్కెట్లు బుక్‌ చేసుకున్నట్లే. ఐతే స్వదేశంలో విండీస్‌పై ఆడినట్లు ఆస్ట్రేలియాలో ఆడితే కుదరదు.

Story first published: Monday, October 15, 2018, 11:56 [IST]
Other articles published on Oct 15, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+