Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Aakash Chopra : రిషబ్ పంత్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ వికెట్ కీపర్ కం బ్యాటర్

Rishabh Pant Is Best Wicket Keeper Cum Batter For Team India Praises Aakash chopra

క్రికెట్ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్ అయిన ఆకాశ్ చోప్రా.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదో టెస్ట్‌లో రిషబ్ పంత్ వీరోచితమైన బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. అతను టెస్టుల్లో అత్యుత్తమ భారత వికెట్ కీపర్ కం బ్యాటర్ అని పేర్కొన్నాడు. ఇక 24ఏళ్ల పంత్ 111బంతుల్లో 146పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. అతని ఇన్నింగ్స్‌లో 19ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (83 నాటౌట్)తో కలిసి ఆరో వికెట్‌కు 222పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 300 దాటించాడు. ఇక 98పరుగులకే 5వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడ్డ.. భారత్‌ను గట్టెక్కించడంలో రిషబ్ పంత్ చూపిన పోరాటం అసాధారణం.

ఇంగ్లాండ్‌పై ఇంగ్లాండ్ స్టైల్లో..

ఇంగ్లాండ్‌పై ఇంగ్లాండ్ స్టైల్లో..

ఇక ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. 'రిషబ్ పంత్ టెస్టులలో భారత్ తరఫున ఆడిన అత్యుత్తమ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అని నేను భావిస్తున్నా. అతనికి ఇంకా 25ఏళ్లు కూడా లేవు. అతను కేవలం 30మ్యాచ్‌లలో ఆడిన చాలా ఇన్నింగ్స్‌లు మ్యాచ్ డిసైడింగ్‌గా మారాయి. ఇంత తక్కువ టైంలో ఇంతటి ప్రదర్శన కనబర్చడం నిజంగా సంచలనమనే చెప్పాలి' అని చోప్రా పేర్కొన్నాడు. ఇకపోతే తొలి రోజు 27.5ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 98పరుగులు చేసింది ఇండియా. అప్పటికే గిల్, హనుమ విహారీ, పుజారా, కోహ్లీ, శ్రేయస్ అయ్యార్ ఔటయ్యి పెవిలియన్ బాట పట్టారు. దీంతో ఈ పరిస్థితుల్లో ఏ బ్యాటర్ అయినా చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాలని చూస్తాడు. కానీ పంత్ మాత్రం ఇంగ్లాండ్‌పై ఇంగ్లాండ్ స్టైల్లో ఎటాకింగ్ గేమ్ ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అతనికి తోడు జడేజా మరోవైపు వికెట్ కాపాడుతూ.. రాణించాడు. ప్రస్తుతం రెండో రోజు సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.

జడేజా ఎదుగుదల అమోఘం

జడేజా ఎదుగుదల అమోఘం

జడేజా ఎదుగుదల గురించి సైతం ఆకాశ్ చోప్రా స్పందించాడు. 'సర్ జడేజా పోరాడటానికి ఇష్టపడే బ్యాటర్‌. అతను తన శక్తిని ఉపయోగించుకోవడంలో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాడు. కఠినమైన దశల్లో అతను చూపించే తెగువ, టెక్నిక్‌ను ప్రశంసించాలని, అతన్ని విశ్వసించాలని తెలిపాడు.' ఇక భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 338పరుగులు చేసింది. ఇక రెండో రోజు ఆట రసవత్తరంగా కొనసాగుతుంది. మొదటి సెషన్లో షమీ (16పరుగులు 31బంతుల్లో 3ఫోర్లు) కొట్టి కాసేపు అలరించినా.. అతన్ని స్టువర్ట్ బ్రాడ్ క్యాచ్ ఔట్ చేశాడు. 82ఓవర్లు ముగిసేసరికి ఇండియా 9వికెట్లు కోల్పోయి 375పరుగులు చేసింది. జడేజా (104పరుగులు 194బంతుల్లో 13ఫోర్లు)ను అండర్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లాండ్ తరఫున వెటరన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ 4 వికెట్లు, మాథ్యూ పాట్స్‌ 2, బెన్‌స్టోక్స్‌ , జో రూట్‌, బ్రాడ్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

తుది జట్లు :

తుది జట్లు :

భారత్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్(కీపర్), జాక్ లీచ్, మ్యాటీ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Story first published: Saturday, July 2, 2022, 16:06 [IST]
Other articles published on Jul 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+