Wasim Jaffer : టీ20ల్లో పంత్ ఓపెనర్‌గా దిగాలి.. రోహిత్ శర్మ ఆ స్థానంలోకి వెళ్లాలి

రిషబ్ పంత్ టీ20I క్రికెట్‌లో ఓపెనింగ్ స్పాట్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరచొచ్చని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ రోహిత్ శర్మ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించే ప్రయత్నం చేయాలన్నాడు. 2013ఛాంపియన్స్ ట్రోఫీలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రోత్సహించడంతో రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగి సెట్టయ్యాడన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ వైట్ బాల్ కెరీర్ ఎంత బాగా సాగిందో మనం చూశామని జాఫర్ పేర్కొన్నాడు. రిషబ్ పంత్‌ను టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా ఆడించడానికి రోహిత్ తగిన చర్యలు చేపట్టాలంటూ జాఫర్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ప్రస్తుత భారత్ జట్టులో నం.4లో బ్యాటింగ్ చేయగల అన్ని రకాల స్కిల్స్ రోహిత్ వద్ద ఉన్నాయని కూడా సూచించాడు. పంత్ 2022లో రెండు T20ల్లో ఓపెనర్ పాత్ర పోషించాడు. కాస్త దూకుడుగానే కన్పించాడు.

రవీంద్రా జడేజా దూరమవ్వడంతో..
యూఏఈలో ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో పంత్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో టీ20I జట్టులో అతని స్థానం గురించి ప్రశ్నలు రేకెత్తాయి. వాస్తవానికి దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఓపెనర్ మ్యాచ్‌కు కూడా పంత్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. గ్రూప్ స్టేజు తర్వాత రవీంద్ర జడేజాకు మోకాలి గాయం కావడంతో భారత్‌కు టాప్ 6లో ఎడమచేతి వాటం ఆటగాడు అవసరమొచ్చింది. దీంతో సూపర్ 4 దశలో ప్లేయింగ్ 11లో పంత్ ఉండాల్సిన అవసరం కీలకమైంది. రవీంద్ర జడేజా కూడా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమవ్వడంతో ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన 15మంది సభ్యుల జట్టులో పంత్ సెలెక్ట్ అయ్యాడు. పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరూ జట్టులో ఉన్నందున వీరిలో ఎవరినీ తీసుకుంటారు.. ఇద్దరిని తీసుకుంటారా లేక ఒకరికి ఛాయిస్ ఇచ్చి మరొకరిని బెంచ్‌కు పరిమితం చేస్తారా అనేది చూడాల్సి ఉంది.

వసీం జాఫర్ బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం..
భారత్ ఆసియా కప్‌లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ జోడీతో ఓపెనింగ్ ప్రారంభించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ విశ్రాంతి తీసుకున్నప్పుడు.. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగి.. తన తొలి టీ20 సెంచరీని సాధించాడు. జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఓపెనర్ రేసులో తాను కూడా ఉన్నానంటూ పరోక్షంగా సంకేతాలిచ్చాడు. 15మంది సభ్యులతో కూడిన జట్టులో భారత్ బ్యాకప్ ఓపెనర్‌ను ఎంచుకోలేదు కాబట్టి.. రాహుల్ గానీ, రోహిత్ గానీ మిస్సయితే కోహ్లీ, పంత్ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. ‘నేను ఇప్పటికీ టీ20లో పంత్ అత్యుత్తమ ప్రదర్శనను చూడగలనని భావిస్తున్నాను. రోహిత్ నంబర్ 4బ్యాటింగ్‌కు ఓకే. అప్పట్లో ఎంఎస్ ధోనీ ఓ చొరవ చూపించాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్‌ను ఓపెనర్‌గా పంపించాడు. ఆ తర్వాత మిగిలిన చరిత్ర ఏంటో మనకు తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ పంత్ విషయంలో ఓ చర్య అయితే తీసుకోవాలి. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్ యాదవ్ నా బ్యాటింగ్ ఆర్డర్‌గా భావిస్తాను' అని జాఫర్ చెప్పాడు.

ఈ రెండు సిరీస్‌లలో ప్రయోగాలు ఉంటాయా
ఇకపోతే కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే సిరీస్‌లలో తమ ప్రయోగాలు కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా ఉండబోతుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు జరిగే చివరి ట్యూన్ అప్ ఈవెంట్‌లుగా ఈ సిరీస్‌లు నిలవనున్నాయి. సెప్టెంబర్ 20 నుండి అక్టోబరు 4వరకు జరిగే ఈ రెండు స్వదేశీ సిరీస్‌ల కోసం ప్రకటించిన భారత జట్టే దాదాపుగా టీ20 ప్రపంచకప్ కోసం వెళ్లే జట్టుగా ఉంది. ఇకపోతే రిషబ్ పంత్ టీ20 క్రికెట్‌లో తన సత్తా మేరకు రాణించలేకపోయాడు. 58మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. పంత్ కేవలం 934పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కేవలం 23గా ఉండడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications