T20 World Cup 2022: ఏమిటీ అన్యాయం.. అతనికి ఆడే అవకాశం ఇవ్వరా.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అడిలైడ్ లోని ఓవల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సూపర్-12 మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు నిరాశే మిగిలింది. జట్టు యాజమాన్యం అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదు. దీంతో రిషబ్ పంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా టీమ్ మేనెంజ్ మెంట్ పై మండిపడుతున్నారు. రిషబ్ పంత్ కు ఇంకెప్పుడు ఛాన్స్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

కేఎల్ రాహుల్
ఆశ్చర్యకరంగా ఈ టీ20 వరల్డ్ కప్ వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్ ను మళ్లీ తుది జట్టులోకి తీసుకున్నారు. రాహుల్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఫేలయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులే చేశాడు. అయినా అతన్ని జట్టులోకి తీసుకున్నారు.

దినేష్ కార్తీక్
దినేష్ కార్తీక్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ లో అంతగా రాణించడం లేదు. అయినా అతడిని కొనసాగించడంపై పంత్ ఫ్యాన్స్ విభేదిస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కార్తీక్ గాయపడ్డాడు. దీంతో పంత్ జట్టులోకి వస్తారని అంతా భావించారు. కానీ కార్తీక్ నే జట్టులో కొనసాగించారు. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో ఒక మార్పు చేసింది. దీపక్ హుడా స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకున్నారు.
భారత జట్టు
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దీక్ పాండ్యా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్ష్ దీప్ సింగ్.
బెంచ్: రిషబ్ పంత్, హర్షల్ పటేల్, చాహల్, దీపక్ హుడా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications