Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషబ్ పంత్‌ని ఎలా తప్పిస్తారు?: ఫరూక్ ఇంజనీర్ డిమాండ్

Rishabh Pant has technical issues in keeping wickets: Farokh Engineer

హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌తో పాటు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని కూడా ఆడించాలని మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ డిమాండ్ చేశాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పంత్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సిరిస్‌లో సెంచరీతో పాటు 350 పరుగులతో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ నమోదు చేయడంతో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన భారత తొలి వికెట్ కీపర్‌గానూ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

వరల్డ్ కప్‌లో రిషబ్ పంత్

వరల్డ్ కప్‌లో రిషబ్ పంత్

ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో కూడా రిషబ్ పంత్‌ను ఆడించాలనే పలువురు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వరల్డ్ కప్ కోసం వికెట్ కీపర్‌గా మహేంద్రసింగ్ ధోనీతో పాటు రిషబ్ పంత్ కూడా ఉన్నాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

పంత్‌పై ఎమ్మెస్కే ప్రసాద్ ఇలా

పంత్‌పై ఎమ్మెస్కే ప్రసాద్ ఇలా

"టీమిండియా వరల్డ్‌కప్ ప్రణాళికల్లో రిషబ్ పంత్ కూడా ఒక వికెట్ కీపర్‌గా ఉన్నాడు. రేసులో ఉన్న ముగ్గురు వికెట్ కీపర్లు (ధోనీ, పంత్, దినేశ్ కార్తీక్) ఇటీవల అత్యుత్తమంగా రాణిస్తున్నారు. ఆస్ట్రేలియాతో టీ20, టెస్టు సిరీస్‌‌ల్లో ఆడిన పంత్‌కి విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే తప్పించాం. పంత్‌తో పాటు జట్టులోని ఆటగాళ్లందరి పని ఒత్తిడిపైనా దృష్టి సారించి నిర్ణయం తీసుకుంటున్నాం" అని చెప్పుకొచ్చాడు.

మే 30 నుంచి వరల్డ్ కప్ ఆరంభం

మే 30 నుంచి వరల్డ్ కప్ ఆరంభం

మే 30 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా ఫరూక్ ఇంజినీర్ మాట్లాడుతూ "ధోనీ తరహాలోనే రిషబ్ పంత్ కూడా సత్తా చాటుతున్నాడు. పంత్‌ని ఇప్పుడే ఎక్కువగా పొగిడి ఆకాశానికి ఎత్తేయకుండా.. కొంచెం ప్రోత్సహించండి చాలు. అతని ఆటలో ఇంకా చాలా టెక్నికల్ తప్పులు ఉన్నాయి" అని అన్నాడు.

రిషబ్ పంత్‌ని ఎలా తప్పిస్తారు?

రిషబ్ పంత్‌ని ఎలా తప్పిస్తారు?

"వన్డే ప్రపంచకప్‌కి ధోనీని ఎంపిక చేస్తారు సరే.. మరి రిషబ్ పంత్‌ని ఎలా తప్పిస్తారు? ఇటీవల బాగానే ఆడుతున్నాడు కదా? జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లని డైలమాలో పడేసే ప్రశ్నలివి. ఇక్కడ నేనేమీ పంత్‌ను విమర్శించడం లేదు. కేవలం ఆటని మెరుగుపర్చుకోవాలని మాత్రమే సూచిస్తున్నా. గతంలోనే అతను మంచి వికెట్ కీపర్‌ అవుతాడని చెప్పాను" అని ఇంజనీర్ చెప్పాడు.

Story first published: Thursday, January 10, 2019, 17:10 [IST]
Other articles published on Jan 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+