ఐపీఎల్ 2019: రిషబ్ పంత్ ఖాతాలో మరో రికార్డు

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో రిషబ్ పంత్ అత్యుత్తమ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కీపింగ్‌లోనూ పంత్ దూసుకుపోతున్నాడు. టోర్నీలో భాగంగా సోమవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 36 బంతుల్లో 78(6 ఫోర్లు, 4 సిక్సులు)తో చెలరేగి ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అగ్రస్థానంలో పంత్
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న రిషబ్ పంత్ ధోనిని మించి వికెట్ కీపింగ్‌లో రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో రిషబ్ పంత్ 13 క్యాచ్‌లను అందుకుని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో పంత్ క్యాచ్‌ల సక్సెస్ శాతం వందగా ఉంది. అంటే పంత్ ఒక్క క్యాచ్‌ని కూడా నేలపాలు చేయలేదన్నమాట.

రెండో స్థానంలో దీపక్ హుడా
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు దీపక్ హుడా కూడా 10 క్యాచ్‌లు అందుకుని రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దీపక్ హుడా క్యాచ్‌ల సక్సెస్ శాతం కూడా వందగా ఉండటం విశేషం. ఇక, ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్ధిక్ పాండ్యా ఇప్పటివరకు తొమ్మిది క్యాచ్‌లను అందుకున్నాడు.

డుప్లెసిస్ సక్సెస్ రేట్ 91గా
ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్ క్యాచ్‌లు పట్టేందుకు 11 ఛాన్స్‌లు రాగా పది క్యాచ్‌లను అందుకుని ఒక క్యాచ్‌ని నేలపాలు చేశాడు. దీంతో డుప్లెసిస్ సక్సెస్ రేట్ 91గా నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్‌కు 9 ఛాన్స్‌లు రాగా ఎనిమిదింటిని క్యాచ్‌లుగా అందుకున్నాడు.

పలు క్యాచ్‌లను నేలపాలు చేసిన డీకాక్
ఇక, ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ... వికెట్ కీపింగ్‌లో మాత్రం పలు క్యాచ్‌లను నేలపాలు చేశాడు. ఈ సీజన్‌లో డీకాక్ వరుసగా ముంబై తరుపున మూడు హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. డీకాక్‌కు మొత్తం 14 ఛాన్స్‌లు రాగా అందులో పన్నెండును మాత్రమే క్యాచ్‌లుగా అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications