
వద్దని చెప్పేలోపే:
ఓవరనైట్ స్కోర్ 122/5తో రెండో రోజు ఇన్నింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో రోజు ఆటలో మెరుపులు మెరిపిస్తాడని భావించిన పంత్.. అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. టీమ్ సౌతీ వేసిన 59 ఓవర్ రెండో బంతిని రహానె ఆఫ్‌సైడ్ తరలించి పరుగు తీయాలని చూసాడు. అయితే బంతి ఫీల్డర్ సమీపంలోకి రావడంతో.. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న పంత్ పరుగు తీయడానికి సంశయించాడు. పంత్ పరుగు వద్దు అని చెప్పేలోపే రహానె సగం పిచ్ దాటేశాడు.

రహానె కోసం త్యాగం:
రహానె సగం పిచ్ దాటేయడంతో ఇక చేసేదేమి లేక పంత్ కూడా పరుగు కోసం ప్రయత్నం ప్రారంభించాడు. అయితే అప్పటికే బంతి అందుకున్న ఫీల్డర్ అజాజ్ పటేల్ నేరుగా వికెట్ల మీదకు త్రో విసిరాడు. అప్పటికీ పంత్ క్రీజు చేరుకోకపోవడంతో రనౌట్ అయ్యాడు. దీంతో పంత్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ఇలా పంత్ తన వికెట్‌ను రహానె కోసం త్యాగం చేసాడు. పంత్ ఔట్ అయిన అనంతరం భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది.

త్యాగం చేయడం పంత్‌కే సాధ్యం:
టెస్టుల్లో పంత్ రనౌట్ కావడంపై క్రికెట్ విశ్లేషకులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పంత్ రనౌటవ్వడానికి కారణం రహానె అంటూ నిందిస్తున్నారు. 'నెలకు పైగా రిజర్వ్ బెంచ్‌పైనే ఉన్నాడు. పచ్చని పచ్చికపై ఆడే మంచి అవకాశం దక్కింది. కానీ.. సీనియర్ ప్లేయర్ కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు, 'పంత్‌నే బాగానే ఆడాడు. రహానె వల్లే అతడు రనౌటయ్యాడు', 'ఇలా చేయడం పంత్‌కే సాధ్యం', 'పంత్ రనౌట్‌తోనే టీమిండియా ఆలౌటైంది' అని కామెంట్లు చేస్తున్నారు.

ఇదే తొలి సారి:
ఇప్పటివరకు 64 టెస్టులు ఆడిన అజింక్య రహానే తన భాగస్వామి రనౌట్‌లో భాగం కావడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. రహానేతో పాటు రోహిత్ శర్మలు ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో రనౌట్‌లో భాగస్వామ్యం కాలేదు. పంత్ రనౌట్‌తో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు సహచర ఆటగాళ్లు, అభిమానులు తీవ్రంగా నిరుత్సాహపడ్డారు.


Click it and Unblock the Notifications












