టెస్టుల్లోకి పంత్.. రెండో బంతినే సిక్సుగా మలిచి రికార్డుల్లోకి..


ముంబై: భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ వారసునిగా భావిస్తున్న రిషబ్ పంత్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో శనివారం మొదలైన మూడో టెస్ట్‌లో దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పటికే టీ20ల్లో టీమిండియాకు ఆడిన ఈ 20 ఏళ్ల ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మన్..టెస్ట్‌ల్లో 291వ ఆటగానిగా జాతీయ జట్టులోకి రంగప్రవేశం చేశాడు.
మ్యాచ్‌కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ..పంత్‌ను జట్టులోకి ఆహ్వానిస్తూ క్యాప్‌ను అందించగా, సహచరులు చప్పట్లతో ఉత్సాహపరిచారు. తన కెరీర్‌లో 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన పంత్ 54.50 సగటుతో నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలతో సహా ట్రిపుల్ సెంచరీ(308) తన ఖాతాలో వేసుకున్నాడు. గత దేశవాళీ సీజన్‌లో 12 ఇన్నింగ్స్‌ల్లో 972 పరుగులతో రాణించాడు. దీనికి తోడు ఐపీఎల్(2018)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 684 పరుగులతో ఉత్తమ వర్ధమాన ఆటగాని అవార్డును దక్కించుకున్నాడు.

దినేశ్ కార్తీక్ స్థానంలో దిగిన పంత్:
సీనియర్ జట్టుతో సహా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన భారత్ ఏ తరఫున బరిలోకి దిగిన రిషబ్..రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ ఏతో మ్యాచ్‌లో 67 సగటుతో 189 పరుగులు చేశాడు, ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇలా తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఈ యువ వికెట్‌కీపర్ అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్ట్‌ల్లో దినేశ్ కార్తీక్ 0, 20, 1, 0 పరుగులతో ఘోరంగా నిరాశపరచడంతో పంత్ అరంగేట్రానికి మార్గం సుగమమైంది.

వరుసగా 3వికెట్లు తీసినా.. 300కి పైగా స్కోరు:
ఈ సిరీస్‌లో తొలిసారి 300కిపైగా పరుగులు చేసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి 307 పరుగులు చేసింది. పంత్ 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (35), కేఎల్ రాహుల్ (23) తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. కానీ వోక్స్ వరుసబెట్టి మూడు వికెట్లు తీయడంతో భారత్ 82 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది.

రెండో బంతినే సిక్సుగా మలిచి:
ఈ దశలో కెప్టెన్ కోహ్లి (97), రహానే (81) నాలుగో వికెట్‌కు 159 పరుగులు జోడించడంతో భారత్ కోలుకుంది. సెంచరీల ముంగిట వీరిద్దరూ అవుటయ్యారు. కానీ టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్‌తోనే తొలిసారి టెస్టుల్లో అడుగుపెట్టిన యువ ఆటగాడు రిషబ్ పంత్.. వస్తూ వస్తూనే సత్తా చాటాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పంత్.. తాను ఎదుర్కొన్న రెండో బంతికే సిక్స్ బాది ఖాతా తెరిచాడు.
పంత్ ఆటతీరు గిల్‌క్రిస్ట్‌ను తలపించిందని
సిక్స్ ద్వారా టెస్టుల్లో ఖాతా తెరిచిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 12వ ఆటగాడిగా పంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. రషీద్ విసిరిన తొలి బంతిని డిఫెన్స్ ఆడిన రిషబ్.. తర్వాతి గుగ్లీని బౌలర్ మీదుగా సిక్స్‌గా మలిచాడు. తొలి రోజు పంత్ ఆటతీరు గిల్‌క్రిస్ట్ ఆటను తలపించిందని నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. సౌరభ్ గంగూలీ లాంటి మాజీ ఆటగాళ్లు సైతం పంత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications