ఇదేం క్రికెట్ రా బాబూ!.. బంతిని కాళ్లతో బాదిన పంత్! (వీడియో)
IND vs SL: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ మరోసారి స్టేడియంలో తనదైన శైలిలో నవ్వులు పూయించి.. తానెందుకు స్టేడియంలో ఉంటే మ్యాచ్ కు వినోదం అందించగలడో మరోసారి నిరూపించాడు. కొలంబోలోన ఎన్‌సీసీ మైదానంలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన భారత వార్మప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఫుట్‌బాల్ కిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. బ్యాటింగ్ చేస్తూనే బాల్‌ను కాలితో ఫుట్‌బాల్ లాగా తన్నిన సంఘటన చూసి అభిమానులు, కామెంటేటర్లు ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు.
డ్రెస్సింగ్ రూమ్ నుంచి గంభీర్ రియాక్షన్!
ఇన్నింగ్స్ ప్రారంభంలో తొలి మ్యాచ్ వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని రిషబ్ పంత్ కాస్త నెమ్మదిగా ఆడాడు. దాదాపు 21 బంతుల వరకు ఒక్క రన్ కూడా చేయకుండా పూర్తి డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లడం చూసి డ్రెస్సింగ్ రూమ్‌లోని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కాస్త ఆశ్చర్యపోయాడు. అయితే క్రీజులో కుదురుకున్నాక రిషబ్ పంత్ ఒక్కసారిగా గేర్ మార్చి తన మార్క్ విధ్వంసాన్ని ప్రారంభించాడు. లంక బౌలర్లు కేశర నువాంత, దిలుమ్ సుదీరల బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్ ను వేడెక్కించాడు.

వైడ్ బంతికి ఫుట్‌బాల్ కిక్
రిషబ్ పంత్ అటాకింగ్ గేమ్ తో ఒత్తిడిలోకి వచ్చిన లంక స్పిన్నర్ దిలుమ్ సుదీర, అతడిని పరుగులు చేయకుండా అడ్డుకునేందుకు లెగ్ స్టంప్ కు చాలా దూరంగా వైడ్ బంతులు వేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ వైడ్ బంతులను సాధారణంగా వదిలేయకుండా రిషబ్ పంత్ వినూత్నంగా ఆలోచించాడు. తన ఫుట్‌బాల్ నైపుణ్యాలను ఉపయోగిస్తూ.. క్రీజు నుంచే కాళ్లతో ఆ బంతులను ఫుట్ బాల్ కిక్ కొట్టినట్లు స్టేడియంలోకి తన్నాడు. రిషబ్ పంత్ ప్రదర్శించిన ఈ సరదా మేనరిజమ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు రిషబ్ పంత్ ను క్రికెట్ స్టేడియంలో ఫుట్‌బాలర్ అని అభివర్ణిస్తున్నారు.
వినోదానికి కేరాఫ్ అడ్రస్
ఒంటి చేత్తో సిక్సర్లు, స్టేడియంలో రివర్స్ స్కూప్‌లు, సెంచరీ సాధించాక చేసే సమ్మర్‌సాల్ట్ బ్యాక్‌ఫ్లిప్‌లతో సందడి చేసే రిషబ్ పంత్ ఖాతాలో ఇప్పుడు ఫుట్‌బాల్ కిక్ కూడా చేరిపోయింది. భయం ఎరుగని బ్యాటింగ్ స్టైల్, విభిన్నమైన వినోదంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల రిషబ్ పంత్ విన్యాసాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

