Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషబ్ పంత్‌కు బీసీసీఐ బిగ్ షాక్!

శుక్రవారం రాత్రి సీఎస్కేతో జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని సాధించింది. లక్నో జట్టు గెలిచినా ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ పంత్‌పై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రిషబ్ పంత్ కు రూ.12 లక్షల జరిమానా విధించింది.

రూ.12 లక్షల జరిమానా
ఐపీఎల్ ప్రవర్తన నియమావలిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం కనీస ఓవర్ రేట్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు రిషబ్ పంత్‌ను దోషిగా తేల్చారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఈ సీజన్లో ఇది మొదటి తప్పిదం కావడంతో కేవలం కెప్టెన్‌కు మాత్రమే రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఒకవేళ ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే జరిమానా మొత్తం పెరగడంతో పాటు జట్టులోని మిగిలిన సభ్యులకు కూడా మ్యాచ్ ఫీజులో కోత పడే అవకాశం ఉంటుంది. ఈ సీజన్ ముగియడానికి మరో 15 రోజులు మాత్రమే ఉండటంతో మ్యాచ్‌ల తీవ్రత దృష్ట్యా బౌలింగ్ సమయాన్ని నియంత్రించడం కెప్టెన్లకు పెద్ద సవాలుగా మారింది.

Rishabh Pant Fined Rs 12 Lakh for Slow Over-Rate Against CSK Big Shock for LSG Captain Details

ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంపై కెప్టెన్ రిషబ్ పంత్ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్‌లో రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ఈ విజయం జట్టు నైతిక స్థైర్యాన్ని ఎంతగానో పెంచిందని అన్నాడు. ఈ సీజన్ ఎలా ముగిసినా సరే, లక్నో జట్టుగా గర్వపడేలా ఆడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు. అలాగే జట్టులోని ఆటగాళ్లందరికీ స్పష్టమైన బాధ్యతలు అప్పగించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని, తీవ్రమైన ఒత్తిడి ఉండే ఇలాంటి టోర్నమెంట్లలో వ్యూహాలను చాలా సరళంగా ఉంచుకోవడం ముఖ్యమని పంత్ పేర్కొన్నాడు.

ఇదే క్రమంలో లక్నో పేసర్ ఆకాష్ సింగ్ ప్రదర్శనను రిషబ్ పంత్ ప్రత్యేకంగా అభినందించాడు. ఆకాష్ సింగ్ ప్లాన్స్ మార్చకుండా క్రమశిక్షణతో బౌలింగ్ చేశాడని, అతని కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని కొనియాడాడు. అలాగే టాక్టికల్ నిర్ణయాల్లో భాగంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లను ఓపెనర్లుగా పంపి, నికోలస్ పూరన్‌ను వన్ డౌన్‌లో (నంబర్ 3) బ్యాటింగ్‌కు పంపాలనే వ్యూహం కూడా తమకు బాగా కలిసివచ్చిందని రిషభ్ పంత్ వివరించాడు.

Story first published: Saturday, May 16, 2026, 10:06 [IST]
Other articles published on May 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+