Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ ఫొటోలు.. మంచు పర్వతాలపై గర్ల్‌ఫ్రెండ్‌తో పంత్!!

Rishabh Pant enjoys New Year vacations with girlfriend Isha Negi on snow capped mountains

న్యూఢిల్లీ: గత డిసెంబర్ 22న వెస్టిండీస్ పర్యటన ముగియడంతో క్రిస్ట్‌మస్‌, నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి భారత క్రికెటర్లు తమ భాగస్వాములతో కలిసి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు. శ్రీలంక పర్యటన కారణంగా చాలా తక్కువ సమయం ఉండడంతో అందరూ వారి కుటుంబం, స్నేహితులతో కొంత విలువైన సమయాన్ని గడిపారు. నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌ను త్వరలో వివాహమాడనున్నాడు.

ఇషా ప్రేమలో పంత్‌

ఇషా ప్రేమలో పంత్‌

యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కూడా టీవీ నటి ఇషా నేగితో కలిసి క్రిస్ట్‌మస్‌, న్యూఇయర్‌ వేడుకలు చేసుకున్నాడు. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని గర్ల్‌ఫ్రెండ్‌ ఇషాతో గడపడానికి పంత్‌ కేటాయించాడు. వేడుకలలో భాగంగా పంత్-ఇషా మంచు పర్వతాలపై ఎంజాయ్ చేశారు. వీటికి సంబందించిన ఫొటోను ఇద్దరు సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేశారు. దీంతో పంత్-ఇషాల జోడి ప్రేమాయణం మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది.

 ఎప‍్పుడైతే నీతో ఉంటానో:

ఎప‍్పుడైతే నీతో ఉంటానో:

పంత్ ఫొటో షేర్ చేస్తూ.. 'ఎప‍్పుడైతే నీతో ఉంటానో.. అప్పుడు నన్ను నేను బాగా ఇష్టపడుతున్నా' అని క్యాప్షన్‌ ఇచ్చాడు. మరోవైపు ఇషా కూడా ట్వీట్ చేసింది. 'ఐదవ సంవత్సరం, కౌంటింగ్.. లవ్‌ యూ స్కై బిగ్‌ బబ్బీ' అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ట్వీట్ బట్టి చూస్తే ప్రేమ మొదలై సుమారు ఐదేళ్లు అవుతుందని అర్థం అవుతోంది. దీంతో ఇద్దరు ప్రేమలో సీరియస్‌గా మునిగి తేలుతున్నట్లు కనబడుతోంది.

నా సంతోషానికి నువ్వే కారణం:

నా సంతోషానికి నువ్వే కారణం:

ఇటీవల ఇషాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన పంత్‌.. దానికి ఓ అందమైన క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. 'నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా. ఎందుకంటే నా సంతోషానికి నువ్వే కారణం' అని రాసుకొచ్చాడు. ఐదేళ్ల వీరి ప్రేమ డేటింగ్‌ వరకే పరిమితం అవుతుందా.. లేదా పెళ్లి పీటల వరకూ వెళుతుందో చూడాలి.

బీసీసీఐ యాజమాన్యం అండ:

బీసీసీఐ యాజమాన్యం అండ:

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన పంత్‌ మొదటగా బాగానే ఆకట్టుకున్నా.. ఇటీవలి కాలంలో ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. పంత్‌ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమవడంతో ఇప్పటికే టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. మరోవైపు వికెట్ల వెనుక మోస్తారుగా రాణిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయినా యాజమాన్యం అతడికి అండగా ఉంటూ వీలైనన్ని అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తోంది.

టీ20 సిరీస్‌లో మెరిసిన పంత్:

టీ20 సిరీస్‌లో మెరిసిన పంత్:

ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో పంత్‌ బాగా ఆడాడు. ప్రతికూల పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో తన వంతు కృషి చేసాడు. ఇక ఈ నెల 5న శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇక్కడ కూడా రాణిస్తే తిరుగుండదు. పంత్ టీమిండియా తరపున 11 టెస్టులు, 15 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. టెస్టులలో 754 పరుగులు, వన్డేలలో 346 పరుగులు, టీ20లలో 409 పరుగులు చేసాడు.

Story first published: Friday, January 3, 2020, 11:47 [IST]
Other articles published on Jan 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+