ఓ తప్పు DRSకు కోహ్లీని బలవంతం పెట్టారు: పంత్, చాహర్‌లపై దుమ్మెత్తిపోస్తోన్న నెటిజన్లు

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని డీఆర్ఎస్ రివ్యూ తీసుకోవాలని బలవంతపెట్టిన యువ క్రికెటర్లు రిషబ్ పంత్, దీపక్ చాహర్‌లపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మూడో టీ20 జరిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో దీపక్ చాహర్ వేసిన బంతిని క్రీజులో ఉన్న రీజా హెండ్రిక్స్ ఎదుర్కొన్నాడు. అయితే, బంతి అతడి ప్యాడ్స్‌ను తాకడంతో బౌలర్ దీపక్ చాహర్‌తో పాటు ఫీల్డర్లు గట్టిగానే అప్పీల్ చేశారు.

ఫీల్డ్ అంఫైర్ సున్నితంగా
అయితే, భారత ఆటగాళ్ల అప్పీల్‌ను ఫీల్డ్ అంఫైర్ సున్నితంగా తిరస్కరించాడు. అయితే, బౌలర్ దీపక్ చాహర్ మాత్రం బ్యాట్స్‌మెన్ ఔట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీని సమీక్షకు వెళ్లమని బలవంతం చేశాడు. బంతి పిచ్‌ను తాకిన తర్వాత గమనం వికెట్ల వెనుకున్న కీపర్‌కు సరిగ్గా అంచనా వేయగలడు.

రివ్యూ తీసుకోవాలా? వద్దా?
అయితే, రివ్యూ తీసుకోవాలా? వద్దా అనే విషయమై కోహ్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్పష్టంగా చెప్పలేకపోయాడు. బంతి లెగ్ స్టంప్‌ను తాకిందేమోనని తెలుసుకునేందుకు కోహ్లీ రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి లెగ్ స్టంప్‌కు దూరంగా వెళ్లడంతో అతడు నాటౌట్‌గా తేలింది. చాహర్ అత్యుత్సాహాం కారణంగా భారత్ ఓ రివ్యూని కోల్పోయింది.

డీఆర్ఎస్‌పై నిర్ణయం తీసుకునే
డీఆర్ఎస్‌పై నిర్ణయం తీసుకునే విషయంలో వికెట్ కీపర్ పాత్ర ఎంతో కీలకం. ఎందుకంటే స్టంప్ వెనుక ఉన్న వ్యక్తి బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేయగలడు. అదే స్టంప్ వెనుక ధోని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఎందుకుంటే DRS నిర్ణయంలో ధోని ఎన్నడూ తప్పు చేయదు. అంతేకాదు అభిమానులు ముద్దుగా DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్ అని కూడా పిలుచుకుంటారు.

రిషబ్ పంత్ విఫలం
రిషబ్ పంత్ గత కొంతకాలంగా తన బ్యాట్‌తో ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. డీఆర్ఎస్ విషయంలో బౌలర్లు, కెప్టెన్‌కు సహాయం చేసేందుకు వికెట్ కీపర్‌కు ఉండాల్సిన నైపుణ్యాలు కూడా అతనికి లేవు. కాగా, మూడో టీ20లో దీపక్ చాహర్ తన అద్భుతమైన సీమ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, భావోద్వేగంతో కోహ్లీని తప్పు DRS తీసుకోమని బలవంతం చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications