Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిష‌బ్ పంత్ మైండ్‌ కోచ్‌ను సంప్రదించాలి: మాజీ క్రికెట‌ర్

Rishabh Pant could do with a mind coach says Brad Hogg


సిడ్నీ:
టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మానసికంగా దృఢంగా అవ్వాలని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం పంత్‌ మైండ్‌ కోచ్‌ను సంప్రదించాలి, ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు మైండ్‌ కోచ్‌ దగ్గర శిక్షణ తీసుకుంటారు అని బ్రాడ్ హాగ్‌ పేర్కొన్నారు. ఎంతో అపార‌మైన ప్ర‌తిభ పంత్ సొంత‌మ‌ని, క్రిజ్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు అత‌ని బ్యాటింగ్ చూడ‌డానికి నేను ఖ‌చ్చితంగా టీవీ ఆన్ చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.
Rishabh Pant Comes To Bat, Then I Turn On My Television Says Former Australia Cricketer
 మైండ్‌ కోచ్‌ను సంప్రదించాలి:

మైండ్‌ కోచ్‌ను సంప్రదించాలి:

తాజాగా బ్రాడ్ హాగ్‌ ట్విటర్‌లో ప్రశ్న-జవాబుల సమయంలో నెటిజన్లతో మాట్లాడాడు. 'పంత్‌ క్రీజులోకి వచ్చినప్పుడు అతడి బ్యాటింగ్‌ కోసం కచ్చితంగా నేను టీవీ ఆన్‌ చేస్తా. పంత్ ఆటను ఎంతో ఆస్వాదించవచ్చు. ఎంతో అపారమైన ప్రతిభ అతడి సొంతం. కానీ.. పంత్‌ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అతడు మానసికంగా దృఢంగా అవ్వడం కోసం మైండ్‌ కోచ్‌ను సంప్రదించాలి. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు మైండ్‌ కోచ్‌ దగ్గర శిక్షణ తీసుకుంటారు. ఈ విషయాలన్నీ అతడి మనసులో ఉంటాయి' అని బ్రాడ్‌ హాగ్‌ అన్నారు.

 నిల‌క‌డ‌లేమి ఆట‌తో చోటు కోల్పోయాడు:

నిల‌క‌డ‌లేమి ఆట‌తో చోటు కోల్పోయాడు:

రిషబ్ పంత్ భార‌త్ త‌ర‌పున 13 టెస్టులు, 16 వ‌న్డేలు, 27 టీ20లు ఆడాడు. ఇటీవ‌ల నిల‌క‌డ‌లేమి ఆట‌తో ప‌రిమిత ఓవ‌ర్ల‌ జ‌ట్టులో చోటు కోల్పోయాడు. అత‌ని స్థానంలో లోకేష్ రాహ‌ల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఇక ఇటీవల ముగిసిన కివీస్‌తో టెస్ట్ సిరీస్‌లో పంత్‌ను కాద‌ని వృద్ధిమాన్ సాహాకు తుది జ‌ట్టులో స్థానం క‌ల్పించారు. దీంతో పంత్ ఖాళీగా కూర్చోవడం తప్పిదే చేసేదేం లేదు. రాహుల్ కీపింగ్ చేస్తుండడం కూడా పంత్‌కు భారీ దెబ్బగానే చెప్పుకోవచ్చు.

రోహిత్ మాత్రమే టీ20ల్లో డబుల్ సెంచరీ చేయగలడు:

రోహిత్ మాత్రమే టీ20ల్లో డబుల్ సెంచరీ చేయగలడు:

ఇటీవల బ్రాడ్ హగ్ మాట్లాడుతూ... 'పొట్టి ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేయగల సామర్థ్యం ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకి మాత్రమే ఉంది. టీ20ల్లో రోహిత్ స్ట్రైక్‌రేట్ (138.79) బాగుంది. అతడి షాట్ సెలక్షన్, టైమింగ్, షాట్స్ అమోఘం. ప్రపంచంలోని ఏ క్రికెట్ గ్రౌండ్‌లోనైనా అలవోకగా సిక్సర్లు బాదగలడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నదంటే.. భారీ స్కోర్ చేస్తాడు. అతడే పొట్టి ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేయగలడు' అని బ్రాడ్ హగ్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్, ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ అరోన్ ఫించ్‌లను కాదని టీమిండియా ఓపెనర్‌పై బ్రాడ్ హగ్ నమ్మకంగా ఉన్నాడు.

Story first published: Thursday, March 26, 2020, 7:50 [IST]
Other articles published on Mar 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+