సెంచరీ మిస్సయిన రిషబ్ పంత్‌ని రైనా ఇలా ఓదార్చాడు (వీడియో)
హైదరాబాద్: సాధారణంగా దూకుడుగా ఆడుతున్న ఆటగాడు అవుటైతే చాలా మంది మంది కెప్టెన్లు స్టేడియంలో సంబరాలు చేసుకోవడం మనం చూశాం. కానీ గురువారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ పట్ల గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా వ్యవహరించిన తీరు అభిమానులను అలరించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 208 పరుగులు చేసింది. ఆ తర్వాత 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలోనే కరుణ్ నాయర్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (31 బంతుల్లో 61; 6 ఫోర్లు, 9 సిక్సర్లు), రిషబ్ పంత్ (43 బంతుల్లో 97) రాణించడంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.

సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్న రిషబ్ పంత్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో థంపీ బౌలింగ్‌లో కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ సమయంలో థంపీతో పాటు గుజరాత్ జట్టు సభ్యులంతా ఆనందంలో మునిగిపోయారు. అయితే గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా మాత్రం భావోద్వేగంతో క్రీజులో ఉన్న రిషబ్ పంత్ దగ్గరికి రైనా వెళ్లి అతన్ని ఓదార్చాడు.

అంతేకాదు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అతడికి అభినందనలు కూడా తెలిపాడు. రిషబ్ పంత్ అద్భుత ప్రదర్సనను గుర్తించి రైనా అభినందనలు తెలపడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రీడా స్పూర్తిన ప్రదర్శించి అభిమానుల మనసు దోచుకున్నందుకు అభినందనలువెల్లువెత్తాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications