న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ద్రోణాచార్య అవార్డు: రిషబ్ పంత్ కోచ్‌‌తో పాటు ఆచంట శ్రీనివాసరావు

Rishabh Pant coach tarak sinha and vijay sharma in line for dronacharya award

హైదరాబాద్: టీమిండియా యువ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ కోచ్ తారక్ సిన్హా పేరును ద్రోణాచార్య అవార్డుకు సిఫారసు చేశారు. తారక్ సిన్హాతోపాటు టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తండ్రి, కోచ్ అయిన ఆచంట శ్రీనివాసరావు, వెయిట్ లిప్టింగ్ కోచ్ విజయ్ సింగ్ పేర్లను కూడా ద్రోణాచార్య అవార్డుకు సిఫారసు చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో 'సోనెట్ క్రికెట్ క్లబ్‌'ను నిర్వహిస్తున్న తారక్ సిన్హా అశోక్ చోప్రా, అతుల్ వాసన్, అంజుమ్ చోప్రా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, ఆశిష్ నెహ్రా లాంటి అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చి దిద్దారు. అంతేకాదు మహిళల జాతీయ జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరించారు.

అంతేకాదు ఆయన భారత మహిళల జట్టుకు కోచింగ్ బాధ్యతలు చేపట్టిన ఏడాదే మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఇక, విజయ్ సింగ్ విషయానికి వస్తే వరల్డ్ ఛాంపియన్ మీరాబాయి చాను, గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన స్వర్ణం నెగ్గిన సంజితా చానులను తీర్చిదిద్దారు.

ద్రోణాచార్య అవార్డుకు సిఫార్సు అయిన వారిలో టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ కోచ్, తండ్రి అయిన ఆచంట శ్రీనివాసరావు కూడా ఉన్నారు. శరత్ కమల్ ఎనిమిదిసార్లు కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించారు. ఆసియా గేమ్స్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు గెలిచాడు.

కుమారుడు శరత్ కమల్ సహా ఎందరినో టేబుల్ టెన్నిస్ క్రీడాకారులుగా ఆయన తీర్చిదిద్దారు. తారక్ సిన్హా, శ్రీనివాసరావుతోపాటు పాటు క్లారెన్స్ లోబో (హాకీ), విజయ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), జీవన్ శర్మ (జూడో), సీఏ కుట్టప్ప (బాక్సింగ్) తదితరుల పేర్లను ఈ ఏడాది ద్రోణాచార్య అవార్డుకు సిఫారసు చేశారు.

పూర్తి అవార్డుల జాబితా:
ద్రోణాచార్య అవార్డు:
తారక్ సిన్హా (క్రికెట్), క్లారెన్స్ లోబో (హాకీ), విజయ్ శర్మ (వెయిట్ లిప్టింగ్), జీవన్ శర్మ (జూడో), సీఏ కట్టప్ప (బాక్సింగ్), శ్రీనివాసరావు (టేబుల్ టెన్నిస్).

ధ్యాన్ చంద్ అవార్డు:
భారత్ ఛెత్రి (హాకీ), సత్యదేవ్ (ఆర్చరీ), దాదు చౌగులే (రెజ్లింగ్), బాబీ ఆలోసిస్ (అథ్లెటిక్స్).

అర్జున అవార్డు:
సతీష్ కుమార్ (బాక్సర్), స్మ్రితి మన్ధన (క్రికెట్), మన్ప్రీత్ సింగ్ (హాకీ), సవిత (హాకీ), కల్ రవి (నీలి చోప్రా), జింసెన్ జాన్సన్ (అథ్లెటిక్స్), హిమ దాస్ (అథ్లెటిక్స్) రఘీ సర్నాబట్ (షూటింగ్), శ్రీయాసి సింగ్ (షూటింగ్), జి సతియాన్ (టేబుల్ టెన్నిస్), మనికా బాత్రా (టేబుల్ టెన్నిస్), సుమిత్ (రెజ్లింగ్), రోహన్ బోపన్న (టెన్నిస్), పూజా కడియాన్ (వూషూ), శంభాకర్ శర్మ (గోల్ఫ్), అంకుర్ ధామ్ (పారా అథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్)

Story first published: Monday, September 17, 2018, 17:38 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X